అన్నకు తగ్గ తమ్ముడు...2019 జనసేన పార్టీ టికెట్లు అమ్ముకుంటున్న పవన్..?

KSK
అన్నకు తగ్గ తమ్ముడు...అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టేసి 2009 ఎన్నికల టికెట్లు అమ్ముకొని ఆ తర్వాత ఆ ఎన్నికల్లో ఓడిపోయిన నేపథ్యంలో పార్టీని కాంగ్రెస్ పార్టీకి అమ్మేశారు..అయితే సేమ్ సీన్ రిపీట్ చేస్తున్నాడు తమ్ముడు పవన్ కళ్యాణ్. గుంటూరు జనసేన పార్టీ ఆవిర్భావ మహాసభ లో నాలుగు సంవత్సరాలు చంద్రబాబు అభివృద్ధి చేశారన్న పవన్ ఆ తరువాత జరిగిన ఈ మహాసభలో చంద్రబాబు పై ఆయన కుమారుడు నారా లోకేష్ పై లేనిపోని అవినీతి ఆరోపణలు చేసి రాష్ట్ర రాజకీయ నాయకులను గందరగోళానికి గురి చేశారు.


ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్న పవన్ తన మద్దతు ఉపసంహరించుకుని రాష్ట్ర ప్రజలను ప్రభుత్వంపై ఉసిగొల్పే కార్యక్రమాలకు నాంది పలికారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని కూడా ప్రకటించారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ప్రజాపోరాట యాత్ర అంటూ ఉత్తరాంధ్రలో మొదలుపెట్టి చంద్రబాబుపై లేనిపోని అవినీతి ఆరోపణలు చేశారు.


అయితే ఈ క్రమంలో ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలు పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు ఏవీ కూడా నమ్మలేదు. రాష్ట్రాభివృద్ధికోసం వయసుకు మించి కష్టపడుతున్న చంద్రబాబుని తిట్టిన పవన్ కళ్యాణ్ చూసి చాలామంది చీదరించుకున్నారు ఉత్తరాంధ్రవాసులు.


ఈ క్రమంలో ఇటీవల పశ్చిమగోదావరి పర్యటనలో ఉన్న పవన్..ఒక్కసారిగా కంటి ఇన్ఫెక్షన్ అని చెప్పి హైదరాబాద్ వెళ్లి జనసేన పార్టీ ఆఫీసులో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ...చిల్లర రాజకీయానికి తెర లేపారు పవన్. ఇంతకీ మేటర్ ఏమిటంటే..హైదరాబాదు నగరంలో 2019 జనసేన పార్టీ టికెట్లు…. మేధావులతో సమావేశం అంటూ పార్టీ టిక్కెట్లు అమ్ముకుంటున్నారని పొలిటికల్ వర్గాల్లో టాక్. ఇందులో ఎంత వరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ...తాజాగా ఈ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: