"కొడాలి నాని"... సంచలన వ్యాఖ్యలు..రాజకీయ బిక్ష..

Bhavannarayana Nch

నందమూరి ఫ్యామిలీ లో అందరికంటే కూడా హరికృష్ణ ఫ్యామిలీ తో కొడాలి నానికి అత్యంత దగ్గర అనుభంధం ఉంది..ఈ విషయం కూడా అందరికీ తెలుసు..హరికృష్ణ ఇంట్లో ఎటువంటి కార్యక్రమం జరిగినా సరే తప్పకుండా కొడాలి నాని ఉండాల్సిందే ఆయన లేకపోతే హరికృష్ణ కొడుకు ఎన్టీఆర్ ఊరుకునే వారు కాదట అంతగా అనుభంధం వారితో ఉండేదట..అలా హరికృష్ణ తో ఏర్పడ్డ అవినాభావ సంభంధం మెల్ల మెల్లగా జూనియర్ ఎన్టీఆర్ తో కలగడంతో వారు ఇద్దరు కూడా ఎంతో అనుభందంగా ఉండేవారు..

 

ఇదిలాఉంటే ఈరోజు ఉదయం హరికృష్ణ రోడ్డు ప్రమాదంతో చనిపోయిన విషయం తెలుసుకున కొడాలి నాని హుటాహుటిన హైదరాబాద్ ప్రయాణం అయ్యారు..ఎన్టీఆర్ ని పరామర్శించారు..ఎన్టీఆర్ ని హత్తుకుని నేనున్నాను అనే భరోసా ఇచ్చారు..అనంతరం హైదరాబాద్‌కు భౌతికకాయాన్ని తరలించే సమయంలోనూ ఎన్టీఆర్ వెంటే ఉన్నారు...హరికృష్ణ భౌతికకాయాన్ని అంబులెన్స్ నుంచి కిందికి దించారు. హరికృష్ణ అకాల మరణంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

 

అయితే హరికృష్ణ మరణంపై స్పందించిన కొడాలి నాని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు..తనకి రాజకీయ బిక్ష పెట్టిన వ్యక్తి హరికృష్ణ గారని కన్నీటి పర్యంతమయ్యారు..రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో తనని భుజం తట్టి మరీ పైకి తీసుకువచ్చిన ఏకైక వ్యక్తి నాని అని తెలిపారు..తనను కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా నియమించింది ఆయనేనని..హరికృష్ణ లేనిదే తనకు రాజకీయ జీవితం లేదని కొడాలి నాని చెప్తూ ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ తెలిపారు..ఎప్పుడూ సరదాగా  ఉండే ఆయన ఈ సమయంలో మనమధ్య లేకపోవడం ఎంతో భాదాకరమైన విషయమని తెలిపారు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: