ఏదైనా పాదయాత్ర అయిపోయాక తెలుస్తుంది టికెట్ వస్తుందో రాదో అని ఆమెతో అన్న జగన్..!

KSK
వైసీపీ అధినేత జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర విశాఖపట్టణం జిల్లాలో ప్రస్తుతం సాగుతోంది. పాదయాత్రలో చాలామంది మాజీ నాయకులు అలాగే కొత్తగా రాజకీయాలలోకి వద్దాం అని అనుకుంటున్నవారు వైసీపీ పార్టీ కండువా కప్పుకోవడానికి రెడీ అయిపోయారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో విశాఖ పట్టణం జిల్లాలో అత్యధిక సీట్లు గెలవాలని పార్టీ నాయకులు ఇప్పటి నుండే వైసీపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు.


ముఖ్యంగా విశాఖ జిల్లాలో వైసీపికి అనుకూలంగా పార్టీలోకి చేరిక‌లు జ‌రుగుతున్నాయి.. ఎల‌మంచిలిలో పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్ ను క‌లిసి నాలుగురోజుల క్రితం చింతపల్లి మాజీ ఎమ్మెల్యే గొడ్డేటి దేముడు కుమార్తె మాధవి చేరారు..ముందే ఆమె వేలాదిగా త‌న మ‌ద్ద‌తు దారులతో పార్టీలో చేరాల‌ని భావించారు.. కాని ఆ స‌మ‌యంలో పార్టీ అధినేత ద‌గ్గ‌ర‌కు కొంత‌మంది మాత్ర‌మే వ‌చ్చారు..


ఆ స‌మ‌యంలో భారీ వ‌ర్షం కురిసింది.. పాడేరు సమన్వయకర్త భాగ్యలక్ష్మిని, అరకు పార్లమెంటరీ నియోజకవర్గం సమన్వయకర్తను పరీక్షిత్‌రాజును పరిచయం చేశారని, అందరూ కలసి పార్టీ కోసం పనిచేయాలని సూచించారని మాధ‌వి తెలియ‌చేశారు..అసెంబ్లీ లేదా లోక్‌సభ టిక్కెట్‌ కేటాయింపుపై పాదయాత్ర ముగిసిన త‌ర్వాత తెలియ‌చేస్తాన‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చార‌ని ఆమె తెలియ‌చేశారు.


మొత్తంమీద చూసుకుంటే జగన్ 2019 ఎన్నికల్లో ఎవరికి ఏ సీటు ఇవ్వాలి అన్న విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరో పక్క రాష్ట్రంలో అన్ని సర్వేలలో వైసీపీ పార్టీకి అనుకూలమైన ఫలితాలు వస్తున్నాయి జగన్ ఆచితూచి అడుగు వేయడం నిజంగా ఆశ్చర్యకరమని పేర్కొంటున్నారు రాజకీయవిశ్లేషకులు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: