చంద్ర బాబు మీద మైనారిటీలు అగ్రహాలు...!

Prathap Kaluva

చంద్ర బాబు నిర్వహించిన నారా హమారా టీడీపీ హమారా సభలో ప్రజా స్వామ్య పద్ధతి లో నిరసన తెలపడం చంద్ర బాబు కు నచ్చి నట్లు లేదు.  తన అధికారం మొత్తం ఉపయోగించి వాళ్లపై రకరకాల కేసులు బనాయిస్తున్నారు. బాబు సభలో ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలియజేయడమే ఆ 8మంది యువకులు చేసిన తప్పు. ఆ నిరసనలో కూడా అర్థముంది. వాళ్లు పట్టుకున్న ప్లకార్డులు అక్షరసత్యాలు. కానీ నిజాలు చెబితే చంద్రబాబుకు నచ్చదు కదా. అందుకే వాళ్లపై కక్షకట్టారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఏకంగా రిమాండ్ కి తరలించారు.


నిరసన తెలియజేయడానికి వచ్చిన ఈ ముస్లిం యువకులపై "చంద్రబాబుపై కుట్ర" అనే పెద్ద అభియోగాన్ని మోపారు పోలీసులు. పథకం ప్రకారమే సభలో అల్లర్లు సృష్టించడానికి వీరంతా నంద్యాల నుంచి వచ్చారని తేల్చారు. వారం ముందుగానే దీనికి పథక రచన జరిగిందని పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఈ వ్యవహారంపై మైనార్టీ వర్గాలు భగ్గుమంటున్నాయి. మాకు మంత్రి పదవులివ్వకపోతే పోయారు, కనీసం మా పిల్లల్ని కేసులతో వేధించకండి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్య పంథాలో నిరసన తెలియజేస్తే జైల్లో పెడతారా.. ఇదేమైనా నియంత పాలనా అని నిలదీస్తున్నారు.


చంద్రబాబుతో పెట్టుకుంటే ఇంతే. ఎన్నో సందర్భాల్లో సభల్లో ప్రజలపై చంద్రబాబు విరుచుకుపడిన ఉదంతాలున్నాయి. మొన్నటికిమొన్న కెమెరాలు ఉన్నప్పటికీ లెక్కచేయకుండా నాయీ బ్రాహ్మణులపై బాబు ఏ రేంజ్ లో రెచ్చిపోయారో కళ్లారా చూశాం. ఇప్పుడు ముస్లిం యువకులకు తనదైన శైలిలో టార్చర్ చూపిస్తున్నారు బాబు. మైనార్టీల మద్దతు కోసం సభ పెట్టి, చివరికి అదే మైనార్టీలను రిమాండ్ కు తరలించిన ఘనత చంద్రబాబుది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: