ప్రగతి నివేదన సభా? అది ప్రగతి నిరోధక సభా?

తెలంగాణ ఉద్యమసమయంలో ప్రతి విషయానికి కోర్టుకు వెళ్లటం పోలీసులు ఫిర్యాదు లతో రాజకీయ ప్రయోజనం పొందిన కేసీఆర్ వ్యూహాలకు తగ్గట్లే, తాజాగా ఆయన బాటలోనే తెలంగాణా ప్రజలు నడిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉద్యమ సమయంలో తన రాజకీయ ప్రయోజనాలకు తగ్గట్లుగా ప్రభుత్వంతో చదరంగం ఆడేసిన కేసీఆర్ కు ఆయన విధానంలోనే ఆయన్ను ఆయన రాజకీయ విధానాలను నిరోధించే విధంగా ప్రయత్నాలు జరుగుతుండటం ఆశ్చర్యకరం కాకపోయినా ఆసక్తికరం అయిపోయింది. 




అధికార టిఆరెస్ తమ నాలుగున్నరేళ్ల పరిపాలన గురించి గొప్పలు "బంగారు తెలంగాణా స్థాపన" గుఱించి ప్రజలకు నివేదించేందుకు ఉద్దేసించిన "ప్రగతి నివేదన సభ" పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించాలని తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కలవకుంట్ల చంద్రశేఖర రావు - కేసీఆర్ నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఈ బహిరంగ సభ భారత దేశ చరిరలో ఇప్పటి వరకూ జరగని విధంగా ఏర్పాటు చేసి అదే స్థాయిలో 25 లక్షల మంది జనావళిని సమీకరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజా బాహుళ్యంలో ఉన్న ప్రచారం ప్రకారం ఈ "నః భూతో నః భవిష్యతి" అనదగ్గ భారీ బహిరంగ సభ కోసం ₹100 నుంచి ₹125కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంత పెద్ద బహిరంగ సభ ప్రభుత్వ ఆద్వర్యంలో జరుగుతుంటే అధికార యంత్రాంగం దుర్వినియోగం అవ్వటం తధ్యం కదా! అందుకు ప్రజాధన దుర్వినియోగమూ అనంతంగా ఉంటుందని అంటున్నారు. వందలు వేల వాహనాల్లో వివిధ జిల్లాల నుండి బహిరంగ సభకు జనసమీకరణ చేయాలని నిర్ణయించారు. 




ఇంత అధికార దుర్వినియోగం ఆర్ధిక దుబారా తదితర విషయాలను అవగాన చేసుకున్న ఒక వ్యక్తి ఈ సభపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తాజాగా హైకోర్టులో ఒక ప్రజా ప్రయో జన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ బహిరంగ సభకు అనుమతులు ఇచ్చిన అధికారుల తీరును కూడా తప్ప పడుతూ, ఇచ్చిన అనుమతుల్ని వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు ఇమ్మని హైకోర్టును అభ్యర్ధిస్తూ పిల్ దాఖలైంది. జోగులాంబ - గద్వాల్ జిల్లా నడిగడ్డ వాసి "పర్యావరణ పరిరక్షణ సమితి" అధ్యక్షుడు పూజారి శ్రీధర్ ఈ వ్యాజ్యాన్ని  వేశారు. ఇందులో అధికార దుర్వినియోగం జరుగుతున్న తీరును విశదీకరిస్తూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీని, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ను, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చారు.




ప్రగతి నివేదన సభ పేరుతో పాతిక లక్షల మందిని ఒక సభాస్థలికి చేర్చి తమ పాలనా కాలంలో ప్రభుత్వం సాధించిన విజయాల్ని చెప్పేందుకు, వేరే ఇతర  మార్గాలను ఎంచుకోవచ్చని, ఆ విధంగా ఆదేశాలు జారీ చేయాలని హైకోర్ట్ కు సమర్పించిన "పిల్"లో పేర్కొన్నారు.  అంతేకాదు ఆదివారం ఈ సభ జరగ నున్నందున ఈ కేసును అత్యవసరంగా విచారించాల్సి ఉందని పేర్కొనటంతో ఈ రోజు (శుక్రవారం) దీనిపై విచారణ జరిపేందుకు హైకోర్టు ఓకే చెప్పింది. 




సభ కోసం 1600 ఎకరాల్ని భూమిని చదును చేస్తున్నారని, ఇందులోని చెట్లను నరికి వేయటం ప్రభుత్వం సదా నిర్వహించే హరితహార స్పూర్తికి విరుద్దమని అని  అందులో పేర్కొన్నట్లు తెలుస్తుంది.  ఈ భారీ బహిరంగ సభ కోసం విచ్చలవిడిగా లక్షల వాహనాల్ని సిద్ధం చేస్తున్నారని,  దీని కారణంగా రోడ్లపై సాధారణ ప్రజలు తమ అవసరార్ధం  తిరిగే పరిస్థితి ఉందడని,  కాలుష్యం తారస్థాయికి చేరుతుందని, ఈ పరిస్థితులు ప్రజా రవాణా స్తంభనకు దారితీసే అవకాశం ఉందన్నారు.



ఈ సభ కోసం ₹200 కోట్ల ఖర్చు చేస్తున్నారని కూడా ఆరోపించారు. ఈ "పిల్"పై హైకోర్టు విచారణకు ఓకే చెప్పటంతో, తుది నిర్ణయం ఎలా? ఉంటుందన్నది ఇప్పుడు ముఖ్యంగా టిఆరెస్ లో, నాయకుల్లో, ప్రతినిధుల్లో చివరకు రాష్ట్రంలో ఉత్కంట రేపుతోంది. ఖచ్చితంగా ఈ వ్యవహారం ముఖ్యమంత్రిని ముచ్చెమటలు పట్టిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు.




"మామూలు రోజుల్లో ఉద్యోగం కోసమో, జీవనోపాధి కోసమో, అనుక్షణం చచ్చే హైదరాబాద్ వాసులకు ఇలాంటి బహిరంగ సభల వలన చివరకు ఆదివారం పెళ్ళాం పిల్లలతో కుసింత బయటకు వెళ్ళే పరిస్థితులు కూడా లేకుండా పోతున్నాయి. ప్రజలు ఓటేసి అధికారం ఇస్తే, ఈ రాజకీయ నాయకులు అదే ప్రజల జీవితంతో ఆదేశుకుంటున్నారు రా!" అని సామాన్యుడు ఏడవని రోజు లేదు. ఏమైనా ఇలాంటి వ్యవహారాలను తెలంగాణా ప్రజలకు నేర్పిన "నీరజాక్షుడు" ఆయనే కదా! 



"ప్రగతి నివేదన సభ" కు అశేష జనవాహిని చేరుకునేందుకు రూట్‌-మాప్ సిద్ధమయింది.  "సెప్టెంబర్2న రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌ లో జరిగే  భారీ బహిరంగ సభకు తెలంగాణలోని 31జిల్లాల నుంచి వచ్చే అశేష జనవాహిని కోసం రోడ్డు మార్గాలు, పార్కింగ్‌ స్థలాలను సూచిస్తూ పోలీసులు రూట్‌-మ్యాప్‌ను రూపొందించారు.


25 లక్షలకిపైగా ప్రజలు తరలి రానుండటంతో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రం నలు మూలల నుంచి వచ్చే వాహనాలు ఏమార్గంలో ప్రయాణించాలి, పార్కింగ్ స్థలం ఎక్కడ అనేదానిపై మ్యాప్‌ ను తయారుచేశారు. 1500 ఎకరాల్లో ఏర్పాటుచేసిన 20 పార్కింగ్ ప్రదేశాల్లో దాదాపు లక్ష వాహనాలను నిలిపే వీలుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: