2019 ఎన్నికల్లో జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో జోస్యం చెప్పిన బీకాం ఫిజిక్స్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్..!

KSK
2014 ఎన్నికలలో వైసీపీ పార్టీ తరుపున గెలిచి తెలుగుదేశం పార్టీ లోకి వెళ్లిపోయిన ఫిరాయింపు ఎమ్మెల్యే బీకాంలో ఫిజిక్స్ చేశాను అని చెప్పిన శాసనసభ్యుడు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ 2019 ఎన్నికలలో జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో తేల్చిపారేశారు.


ఇటీవల గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన నారా హమారా టిడిపి హమారా కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగం చేస్తున్న సమయంలో కొంతమంది ముస్లిం యువకులు తమ ముస్లిం జాతిపై సమాజంలో జరుగుతున్న దాడిని ప్లకార్డుల రూపంలో చూపిస్తూ నిరసన తెలిపిన క్రమాన్ని ఖండించారు జలీల్ ఖాన్. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గుంటూరులో టీడీపీ నిర్వహించిన  ముస్లిం మైనార్టీ సభలో పథకం ప్రకారంగా వైసీపీ అల్లరి చేయించిందని ఆయన ఆరోపించారు.


తుని తరహలోనే ఈ సభలో కూడ అల్లరి చేసేందుకు కుట్ర పన్నిందని ఆయన చెప్పారు. ప్రత్యర్థి పార్టీల సభల్లో గొడవలు చేయడం వైఎస్‌ కుటుంబానికి అలవాటేనని ఆయన చెప్పారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోని తన ప్రత్యర్థుల సభల్లో గొడివలు చేయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.


ఇదే క్రమంలో జనసేన పార్టీ గురించి మాట్లాడుతూ...క్షేత్ర స్థాయిలో బలం లేని జనసేనకు వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడ రాదని టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ చెప్పారు. స్థానికంగా బలం లేని జనసేనకు ఎలా సీట్లు వస్తాయని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో మళ్లీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సాధిస్తుందని...చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని పేర్కొన్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: