ఐ ఏ ఎస్ స్థాయి అధికారుల మునిమనవళ్ళకు కూడా రిజర్వేషణ్లు కొనసాగించటం న్యాయమా? సుప్రీం సూటిప్రశ్న

భారత దేశానికి స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్ధాలు దాటిపోయింది. ఇంకా దేశంలో కులాల పేరిట జరిగే రిజర్వేషణ్ల తంతు ప్రతిభను కడతేర్చేస్తుంది. సామాజికంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్ద్ జాతుల వారు ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. దేశ పాలనను నియంత్రించే ఉన్నత స్థానాలకు చేరుకున్న ఈ ఎస్సి, ఎస్టి వారికి ఇంకా పదోన్నతులలో  కూడా రిజర్వేషణ్లు కొనసాగించటం అవసరమా?  అనేది దేశ వ్యాప్తంగా "రిజర్వేషన్ పొందని, అర్హతలేని" సామాజిక వర్గాల హృదాయాలు రగిలి పోతున్నాయి. అలాంటి సందర్భమే దేశ సర్వోన్నత న్యాయస్థానం లోని న్యాయమూర్తులను సైతం ఆలోచనల్లోకి నెట్టేసింది.


 

షెడ్యూల్డ్ కులాలు(ఎస్.సి), షెడ్యూల్డ్ జాతులు(ఎస్టి)లకు వృత్తిపరంగా ఉన్నతస్థానాలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కలిపిస్తున్న విషయంలో సుప్రింకోర్టు న్యాయమూర్తులు ఒక కీలక ప్రశ్న సంధించారు. ఉద్యోగాల పరమైన పదోన్నతులలో 'ఐఎఎస్ ల మనుమళ్లు, ముని మనుమళ్లకు కూడా రిజర్వేషన్' వర్తింప చేయవలసిన అవసరం ఉంటుందా? అని న్యాయమూర్తులు న్యాయవాదులను ప్రశ్నించారు. 




రిజర్వేషన్లు నిరంతరం ఉండాలా? ఆ కులాలు, జాతుల్లో 'ఉన్నత స్థాయికి వచ్చిన వారికి సానాజికంగా ఆర్ధికంగా విద్యా విఙ్జాల పరంగా ఎదిగిన కూడా రిజర్వేషణ్లు వర్తింప చేయాలా? ఆ అవసరం ఇంకా ఉందా? ఉంటుందా? అనే కోణంలో న్యాయమూర్తులు ఒక కేసు విచారణ సంధర్భంగా ప్రశ్నించారు. అయితే ఇప్పుడున్న పద్దతిలో మార్పు చేయనవసరం లేదని సొలిసిటర్ జనరల్ వేణుగోపాల్ స్పష్టం చేశారు.



జనరల్ అబ్యర్దుల తరపున వాదించిన సీనియర్ న్యాయవాది శాంతి భూషణ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరుగుతున్నప్పుడు ఎస్.సి, ఎస్టిలకు రిజర్వేషన్లు ఇవ్వవచ్చని, కాని ప్రమోషన్ల విషయంలో రిజర్వేషన్స్ నిరంతరం ఇచ్చుకుంటూ పోతే, అది పెద్ద వైపరీత్యం జాడ్యం అవుతుందని హెచ్చరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: