'ఎన్టీఆర్' రూపం లో చంద్ర బాబు ముందు మరో సవాలు...!

Prathap Kaluva

హరికృష్ణ మరణించడం తో నందమూరి నారా రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయని అందరూ సర్వత్రా ఆసక్తిగా ఉన్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ పార్టీ లో కి రాకుండా అడ్డుకున్నది చంద్ర బాబే నని అందరికీ తెలిసిందే. ఇన్ని రోజులూ హరి పేరుకు టీడీపీలోనే ఉన్నాడు. అది పేరుకు మాత్రమే. ఆయన పొలిట్ బ్యూరో సభ్యుడు కూడా. అది కూడా పేరుకు మాత్రమే. అలా టీడీపీలో ఉండీ లేడనిపించుకున్నాడు హరి. ఇప్పుడు ఆయన వెళ్లిపోయాడు.


అప్పుడే హరి తనయుడు ఎన్టీఆర్ కు పొలిట్ బ్యూరోలో పదవి ఇవ్వాలని, హరి స్థానాన్ని తారక్ తో భర్తీ చేయాలని ఒక వాదన వినిపిస్తోంది. ఈ డిమాండ్ తో చంద్రబాబు గతుక్కుమనవచ్చు. హరి స్థానంలో.. అనే సెంటిమెంట్ ఉంది. అలాగని ఈ సెంటిమెంటుకు చంద్రబాబు విలువను ఇస్తే ఆ తర్వాత ఏం జరుగుతుందో చెప్పనక్కర్లేదు. ఇప్పటికే తనయుడు ‘పప్పు’గా సార్థకనామధేయుడు అయ్యాడు. తనయుడి విషయంలో చంద్రబాబు తీవ్రమైన అభద్రతాభావంలో ఉన్నాడు.


అఖరికి అతడిని ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయించే ధైర్యం లేక.. నెగ్గించేంత వరకూ వేచిచూడలేక నామినేటెడ్ పదవితో మంత్రిని చేసుకున్నాడు. అప్పటికీ చినబాబు ఏమైనా సాధించాడా? అంటే.. రోజుకు ఇంతగా చంద్రబాబు వారసత్వం పరువును తీయడం తప్ప పార్టీ శ్రేణులకు లోకేష్ ఎలాంటి భరోసాను ఇవ్వలేకపోతున్నాడు. అడ్డదారుల ద్వారా పేరు తెచ్చుకునే ప్రయత్నాలు అభాసుపాలు కావడంతో పాటు.. కీలకమైన మాట తడబాటు లోకేష్ ను దెబ్బతీస్తోంది. ఇలాంటి సమయంలో హరి స్థానంలో అంటూ తారక్ ను పొలిట్ బ్యూరోలోకి తెచ్చుకోవడం అంటే.. అదెంత ప్రమాదమో చంద్రబాబుకు తెలియనిది కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: