రాజ‌ధానిలో జ‌న‌సేన హీరోలు ఎవ‌రు..!

VUYYURU SUBHASH
ప్రముఖ సినీ నటుడు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వచ్చే ఎన్నికల్లో ఏపీలోని రెండు తెలుగు రాష్ట్రాల్లో  అన్ని నిమోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సమాయత్తం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్‌ తన ప్రధాన ఫోకస్‌ అంతా తెలంగాణ కన్నా ఏపీలోనే ప్రధానంగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉత్తరాంధ్రలో తన సుధీర్ఘ‌మైన ప‌ర‌ట్య‌న పూర్తి చేసుకున్న పవన్‌ త్వరలోనే ఉభయగోదావరి జిల్లాలతో పాటు రాజధాని జిల్లాలైన కృష్టా, గుంటూరు జిల్లాల్లోను మరో సుధీర్ఘ‌ పర్యటనకు రెడీ అవుతున్నాడు. పవన్‌కు ఏపీలోని మిగిలిన జిల్లాలన్నీ ఒక ఎత్తు... రాజధాని ప్రాంతాలుగా ఉన్న‌ కృష్టా, గుంటూరు జిల్లాలు ఒక ఎత్తు. ఈ రెండు జిల్లాల్లో పవన్‌కు లక్షల సంఖ్యలో అభిమానులతో పాటు ఆయన సొంత సామాజికవర్గ ప్రాబ‌ల్యం మెండుగా ఉంది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో ఇక్కడ సత్తా చాటాల్సిన అవసరం పవన్‌కు ఎంతైన ఉంది. 


గతంలో పవన్‌ అన్న చిరు ప్ర‌జారాజ్యం పార్టీ స్థాపించిన అప్పుడు 2009లో జరిగిన ముక్కోణ‌పు పోటీలో గుంటూరు జిల్లాల్లో ప్రజారాజ్యం పార్టీ ఒక్క సీటు కూడా గెలుచు కోలేకపోయింది. కృష్టా జిల్లాల్లో మాత్రం బలంగా పోటి ఇచ్చిన ప్రజారాజ్యం విజయవాడ వెస్ట్‌, ఈస్ట్‌ నియోజకవర్గాల్లో విజయం సాధించడంతో పాటు పలు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలుగా ఉన్నా తెలుగుదేశం, కాంగ్రెస్‌ అభ్యర్థుల తల రాతలు మార్చే రేంజులో గ‌ణ‌నీయంగా ఓట్లు సాధించింది. అయితే ఇప్పుడు జనసేనకు అదే ఊపు ఉందా అన్నది ప్రశ్నార్దంగా ? మారింది. ఇక గుంటూరు జిల్లాలో 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం మంగళగిరి, గుంటూరు తూర్పు లాంటి నియేజకవర్గాల్లో రెండో స్థానంలో నిలిచి, టీడీపీని మూడో స్థానానికి నెట్టేసింది.


గుంటూరు లోక్‌ సభ నియోజకవర్గానికి పోటీ చేసిన నాటి ప్రజారాజ్యం అభ్యర్థి తోట చంద్రశేఖర్‌ భారీ స్థాయిలో ఓట్లు చీల్చి పరోక్షకంగా టీడీపీ అభ్యర్థి మాదాల రాజేంద్ర ఓటమికి కారణమైయ్యాడు. ఇప్పుడు జ‌న‌సేనకు మంచి ఊపు ఉన్నా... పార్టీ సంస్థాగ‌తంగానే నిర్మాణం జ‌రుపుకోక‌పోవ‌డంతో ప‌లువురు ఆ పార్టీ నుంచి పోటీ చేసే విష‌యంలో సందిగ్ధంలోనే ఉన్నారు. జిల్లాల్లో జనసేన ఏఏ స్థానాల్లో ఎవరెవరిని అభ్య‌ర్థులుగా నిలబెడుతుంది అన్న‌ దానిపై ఇంకా స్పష్టత లేకపోయినా ప్రస్తుతం గుంటూరు జిల్లాలోని పొలిటికల్‌ ట్రెండ్‌ బట్టీ చూస్తే ప్రత్తిపాడు, పొన్నూరు, గుంటూరు జిల్లాల్లో తూర్పు, పశ్చిమ, మంగళగిరి, రేపల్లే, వేమూరు, నరసారావుపేట నియోజకవర్గాల్లో బలమైన ప్రభావం 
చూపుతుందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. 


గతంలో ప్రజారాజ్యంలో కీలకంగా వ్యవహరించిన తుల‌సీ కుటుంబం ఇప్పుడు జనసేనలోను అదే కీ రోల్‌ జిల్లాల్లో ప్లేచెయ్యనుంది. ఇక పార్టీ తరుపున చూస్తే నరసారావుపేటలో మాత్రమే జనసేనకు బలమైన అభ్యర్థి కనిపిస్తున్నారు. గతంలో పదేళ్ల కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలణలో ఏకంగా తొమ్మిది సంవత్సరాల పాటు మూడు విడతల్లో ఏఎంసీ చైర్మ‌న్‌గా పని చేసిన జిలాని వచ్చే ఎన్నికల్లో అక్కడ జనసేన నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం జిల్లాల్లో పార్టీ పరంగా బలమైన అభ్యర్ధులు ఎవరని చూస్తూ నరసారావుపేటలో జిలాని, గుంటూరు నగరంలో తులసీ కుటుంబంమినహా మిగిలిన నియోజకవర్గాల్లో అంతా బ‌ల‌మైన అభ్యర్ధులెవరు కనబడుటలేదు. 
డెల్టా ప్రాతంలో ఓ కీలక నియోజకవర్గంలో పార్టీ తరుపున పోటీ చేసేందుకు ఓ మాజీ ఎమ్మెల్యేతో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ స్వయంగా చర్చలు జరిపినట్టు తెలుస్తున్నా  ఆ మాజీ ఎమ్మెల్యే తన అభిప్రాయం ఇంకా ఏది స్పష్టం చేయలేదని తెలుస్తోంది. ఏదేమైన ఎన్నికలకు మరో ఆరేడు నెలల సమయం ఉన్నా నేపథ్యంలో పవన్‌ కళ్యాణ్‌ తన కార్యకలాపాలను గుంటూరు జిల్లాల్లో మరింత విస్తృతం చేయ్యాల్సిన అవసరం ఉంది.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: