పాదయాత్రను ఆపేద్దామనుకుంటూన్న జగన్...వైసీపీ నేతల్లో టెన్షన్..!

KSK
తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను రాజ్యాంగానికి విరుద్ధంగా తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకున ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఎప్పటి నుండో పోరాడుతున్నారు జగన్. ముఖ్యంగా ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న తీరుపై అసెంబ్లీకి వెళ్లకుండా జగన్ నిరసన తెలుపుతున్న విషయం మనకందరికీ తెలిసినదే. ఇందుమూలంగా నే గత అసెంబ్లీ సమావేశాలకు హాజర అవ్వకుండా జగన్ తన పాదయాత్రను చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు.


ఈ క్రమంలో జగన్ అనుసరించిన విధానం పై రాష్ట్రంలో ఉన్న చాలా మంది రాజకీయ నాయకులు మండిపడ్డారు...ప్రతిపక్షనేత అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాడాలని కామెంట్లు కూడా చేశారు. అయితే గతంలో జగన్ సభకు హాజరైన గాని అధికార పార్టీ మైకు ఇవ్వకుండా..అనేకసార్లు అడ్డుకుంటూ వారి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం...ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా బిల్లులు పాస్ చేసుకోవడం...తో జగన్ అసెంబ్లీ లో కూర్చుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ప్రభుత్వాని ప్రశ్నించడానికి కూడా మైక్ ఇవ్వని నేపథ్యంలో...జగన్ ప్రజలు పడుతున్న బాధలను తెలుసుకోవడానికి పాదయాత్రను చేస్తూనే ముందుకు పోయారు.


అయితే ప్రస్తుతం జరగబోయే అసెంబ్లీ సమావేశాలు...చివరి సమావేశాలు నేపథ్యంలో..పాదయాత్ర చేస్తున్న జగన్ ను ఇరుకున పెట్టాలని సడన్ గా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది చంద్రబాబు ప్రభుత్వం. మరి ఈ నేపథ్యంలో  ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో జగన్ మరోసారి తనను తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి...


ఈ క్రమంలో జగన్ అసెంబ్లీకి వెళ్లి టిడిపి ప్రభుత్వాన్ని నిలదీయడం లో సక్సెస్ అయితే మాత్రం వైకాపా శ్రేణులకు అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అవుతుంది. జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరోపక్క తమ అధ్యక్షుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అని వైసిపి నాయకులు టెన్షన్ పడుతున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: