సాధారణంగా అడవిలో సింహాలు, పులులు, చిరుత అంటే ఎవరికైనా చచ్చేంత భయం. అలాంటి కృర మృగాలు సంచరించే ప్రదేశాలకు చాలా దూరంగా ఉంటారు ఎవరైనా. కొన్ని సార్లు పులులు, చిరుతలు గ్రామాల్లోకి రావడం జనాలపై దాడులు చేయడం చూస్తునే ఉన్నాం.
తాజాగా ఓ చిరుత పులి మట్టి రోడు మీద ముడుచుకొని పడుకున్న శునకం మీద ఒక్కసారిగా పంజా విసరబోయింది. అదే సమయానికి అనుకోకుండా ఆ శునకం ఆ చిరుతను చూసి ఒక్కసారే దానిపై రివర్స్ దాడి చేయడానికి ప్రయత్నించింది..అంతే కాదు ఆపకుండా అరవడం మొదలు పెట్టడంతో చిరుత వెనుకంజ వేయక తప్పలేదు.
కొద్ది క్షణాలు ఆగితే ఆ వీధి కుక్కను చిరుత చంపి తినేది. కాకపోతే..ఊహించని విధంగా ఆ చిరుత ఎటాక్ చేయడంతో..ఆ శునకం కొద్ది సేపటి వరకు వణికి పోయింది. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.