ఆదాయం కోసం చంద్ర బాబు శవాలను కూడా వదిలి పెట్టడం లేదా...!

Prathap Kaluva

బుధవారం నాడు చంద్రబాబు.. తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. సదరు సమావేశంలో సహజంగానే కేంద్రలోని భాజపా సర్కారు ఏ రకంగా తమను మోసం చేసిందో చాలా విపులంగా వివరించారు. ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ ను చేరదీసి, వారిని మోడీ ప్రోత్సహిస్తునారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోడీని విలన్ గా తాను ఎస్టాబ్లిష్ చేశారు గనుక.. ఆయనతో కుమ్మక్కు అయినట్లుగా తాను చెబుతున్నారు గనుక.. జనసేన, వైకాపాలకు కూడా ఓట్లు వేయకూడదని యథారీతిగా సెలవిచ్చారు.


ఇదంతా ఒక ఎత్తు అయితే.. కొన్ని కొత్త ఆలోచనలు ప్రభుత్వానికి ఆదాయం సమకూరే మార్గాలను ఆయన చెప్పారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఎవైనా మరణిస్తే.. మునిసిపాలిటీ వారు వచ్చి....  వారి దగ్గరనుంచి కొంత రుసుము తీసుకుని.. శవయాత్ర పూర్తయిన అరగంటలోగా.. శవం మీద చల్లిన పూలు రోడ్డు మీద పడి ఉండగా వాటిని శుభ్రం చేసేస్తారట. ఈ అయిడియా చంద్రబాబుకు తెగ రుచించినట్లుంది. అలాంటి కొత్త కొత్త ఆలోచనలు రావాలంటూ ఆయన పిలుపు ఇచ్చారు.


అంటే త్వరలోనే శవాలమీద కూడా బిజినెస్ చేయడానికి చంద్రబాబునాయుడు కొత్త చట్టాలు తేబోతున్నారన్నమాట. శవయాత్ర జరిగితే.. రుసుము కట్టకపోతే.. శవం మీద చల్లిన పూలు తీసేయరా? ఎన్ని పూలు శవం మీద చల్లితే ఎంత రుసుము కట్టాలి? కొద్ది పూలు మాత్రమే చల్లుకునే పేదలు కూడా రుసుము కట్టాల్సిందేనా? బాబు ఐడియాలో ఇవన్నీ ప్రశ్నలే. చంద్ర బాబు ప్రభుత్వం అవినీతి లో నెంబర్ 1 అని ఇప్పటికే నీతి ఆయోగ్ తేల్చి పారేసింది. అయినా చంద్ర బాబు పారదర్శక ప్రభుత్వాన్ని నడిపిస్తున్నామని చెబుతుంటాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: