ఎస్పీ ఆత్మహత్యాయత్నం..కారణం అదేనా!

Edari Rama Krishna
ఈ మద్య కామన్ పీపుల్స్ నుంచి సెలబ్రెటీల వరకు చిన్న చిన్న విషయాలకు మనస్థాపం చెంది..చివరకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తుంది. తాజాగా కాన్పూర్ నగర పోలీస్ కమిషనర్ సురేంద్ర కుమార్ దాస్ ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. ఆయనను వెంటనే స్థానిక రెజెన్సీ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేర్చారు. 

ప్రస్తుతం  ఎస్పీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సురేంద్ర కుమార్ దాస్ ఆత్మహత్యా యత్నానికి ఆయన కుటుంబ కలహాలు కారణం అయి ఉండవొచ్చు అని ఎస్ ఎస్పీ సంజీవ్ సుమన్ అంటున్నారు. 2014 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సురేంద్ర కుమార్ దాస్ లక్నో‌కు చెందిన వారు.

కాన్పూర్ ఈస్ట్రన్ ఎస్పీగా ఆయన ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా, ఈ ఏడాది మేలో ఉత్తరప్రదేశ్ ఏటీఎస్‌కు చెందిన అదనపు ఎస్పీ రాజేష్ సహ్ని అనుమానాస్పద స్ధితిలో లక్నోలోని గోమతినగర్ కార్యాలయంలో తుపాకీ గాయాలతో మృతిచెందడం సంచలనమైంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: