కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు కారణం అదేనా... మరీ బాబు...!

Prathap Kaluva

కేసీఆర్ ధైర్యం చేసి ముందస్తు ఎన్నికలు సిద్ధం అయ్యాడు. ఎవరూ ఊహించిన విధంగా నవంబర్ లోనే ఎన్నికలని ప్రకటించాడు. కేసీఆర్ బయటకు ఏం చెప్పినా అంతర్గత కారణం మాత్రం ఆయన నమ్మకాలే అని వార్తలు వస్తున్నాయి. కేసీఆర్ నమ్మకాలు, సెంటిమెంట్లు పాలనను అనేక రకాలుగా ప్రభావితం చేస్తున్న వైనం నిత్యం వార్తల్లో ఉండేదే. ఆ నమ్మకాలే ఇప్పుడు ముందస్తు ఎన్నికలను తెస్తున్నాయని అనుకోవాల్సి వస్తోంది.


ఇక్కడ మరో ఆసక్తిదాయకమైన అంశం ఏమిటంటే.. ఇలాంటి ముందస్తు ఎన్నికలు గతంలో ఏపీలో వికటించాయి. చివరిసారిగా ముందస్తు ఎన్నికలు జరిగింది 2004లో. అప్పట్లో చంద్రబాబు నాయుడు ముందస్తుకు వెళ్లాడు. తను వెళ్లడం మాత్రమే కాకుండా వాజ్ పేయిని కూడా తీసుకొచ్చాడు. అప్పట్లో అలిపిరిలో చంద్రబాబుపై దాడి జరగగా.. ఆ సానుభూతిని క్యాష్ చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు వెంటనే ఎన్నికలకు వెళ్లాడు.


చంద్రబాబు గాయాలతో ఉన్న పోస్టర్లతో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది. అయితే.. అంత చేసినా చంద్రబాబు పార్టీ అప్పట్లో చిత్తు చిత్తుగా ఓడింది. మరో జ్యోతిబసు అవుతాడు అని పచ్చపత్రికలు చంద్రబాబు నాయుడు గురించి వార్తలు రాస్తే ఆయనేమో 40 చిల్లర సీట్లకు పరిమితం అయిపోయాడు. బాబుకు అప్పట్లో అలా ముందస్తు ఎన్నికలు కలిసిరాలేదు. తను ముందస్తుకు వెళ్లడమే కాకుండా బీజేపీని కూడా దేశవ్యాప్తంగా ముందస్తుకు తీసుకెళ్లి చిత్తుగా ఓడించాడు చంద్రబాబు. ఆ అనుభవ పాఠంతో చంద్రబాబు ఇప్పుడు ముందస్తు ఊసే ఎత్తడంలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: