2019 ఎన్నికలలో మా గెలుపు అనివార్యం: ప్రధాని నరెంద్ర మోడీ

బిజెపి ప్రభుత్వంలోని ఏవైతే బలహీనతలను చూపుతూ దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఏకమై పోరాడ నున్నాయో - అవే బలహీనతలను తమ బలాలుగా మొహరించి 2019 ఎన్నికల మహకురుక్షేత్ర సంగ్రామంలో విజయం సాధించి అధికారంలోకి వస్తామని ప్రధాని నరెంద్ర మోడీ తమ జాతీయ కార్యవర్గ సమావేశంలో మరింత ఆత్మవిశ్వాసంతో పేర్కొన్నారు. ప్రతిపక్షాలు కేవలం అవాస్తవాలతో పోటీపడుతున్నాయని, అంశాలవారీగా కానే కాదని సార్వత్రిక ఎన్నికల్లో బిజెపికి ఎదురే లేదని, ప్రతిపక్షాలు 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని సవాల్‌ చేసే సామర్ధ్యమే వాటికి లేదని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ప్రతిపక్షాలు వారి విధానాలలో రాజకీయ, ఆర్ధిక, స్వార్ధం తప్ప మొత్తం జాతికి మేలు చేసే ఆలోచనలేవీ లేవని ఉద్ఘాటించారు.  

2014కు ముందు ప్రభుత్వంలో ఉన్న “వారి వైఫల్యాలను” ఇపుడు కూడా  చూపిస్తున్నారని ప్రధాని వెల్లడించారు. 2019 ఎన్నికలకు సంబంధించి తనకు ఎలాంటి సవాళ్లు  కనిపించడం లేదని బిజెపి జాతీయ కార్యవర్గాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ చెప్పారు. బిజెపి ఎల్లప్పుడూ నిర్దేసించుకున్న సిద్ధాంతాల సాధన కోసమే పోరాడుతుందని, బిజెపి అబద్దాలపై పోరాడటం తెలియదని అన్నారు.

రెండో రోజు సమావేశంలో ప్రధాని ప్రసంగం, సమావేశాల వివరాలను న్యాయశాఖమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ మీడియాకు వివరించారు. ప్రతిపక్షాలన్నీ కలిసి నిర్మించిన

*మహాకూటమి, లేదా

*మహాఘటబంధన్‌ ను

నరెంద్ర మోడీ నిర్ద్వంధంగా తిరస్కరించారని, వారి నాయకత్వమే ప్రజల్లో గుర్తింపు కోల్పోయిందని, వారి విధానాలలో స్పష్టత లేదని, వారి ప్రధాన వైఖరి అవినీతి, స్కాములతో మునిగి తరిస్తుందని నరెంద్ర మోడీ వెల్లడించారు.

బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా మాట్లాడుతూ బిజెపి 2019 సార్వత్రిక ఎన్నికలను గత ఐదేళ్లుగా తమ పార్టీ బలం, పనితీరు ఆధారంగానే పోటీచేస్తుందని, మహాకూటమి వల్ల తమకొచ్చే భయమేమీలేదని అన్నారు. ప్రతిపక్షాలన్నీ మహాకూటమిగా ఏర్పాటవుతున్న తరుణంలో వచ్చే సార్వత్రిక ఎన్నికలకు బిజెపి ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బేరీజు వేసి చర్చించేందుకు జాతీయకార్యవర్గ సమావేశం ఏర్పాటుచేసింది. అలాగే సార్వత్రిక ఎన్నికల వ్యూహంపై కూడా విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. బిజెపి ఆధిపత్యాన్ని కట్టడిచేసేందుకు సమాజ్‌వాదిపార్టీ, బహుజన సమాజ్‌ వాదీ పార్టీలు రెండూ కలిసి పోటీచేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
 

*ఫ్రాన్స్‌ డస్సాల్ట్‌ ఏవియేషన్‌నుంచి కొనుగోలుచేస్తున్న రాఫెల్‌ యుద్ధ విమానాల డీల్‌,

*ఆర్ధికవ్యవస్థలోపభూయిష్ట యాజమాన్యం,

*విధివిధానాల అమలులో వైఫల్యం,

*2016లో వచ్చిన పెద్దనోట్ల రద్దు,

*జిఎస్‌టి
 
వంటి వాటినే ప్రధాన అస్త్రాలుగా చేస్తోంది.

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వీటినే ప్రధాన అస్త్రాలుగా మలుచుకుంది. రానున్న ఎన్నికలకు కూడా వీటినే తిరిగి ఎక్కుపెడుతుందని చెప్పవచ్చు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధి ప్రధాని మోడీ ప్రయోగించిన అస్త్రం "రాఫెల్ డీల్" ను రాహుల్ వైపే ప్రయోగించగల బలాలు ఆ డీల్ లో ఇమిడి ఉన్నాయని తెలుస్తుంది. అందుకే ప్రతిపక్షాలు బిజెపి బలహీనతలుగా బావించిన వాటినే బలాలుగా మార్చి తిరిగి ప్రతిపక్షాలపై ప్రయోగించబోతున్నట్లు మోడీ-షా ల వ్యూహంగా కనిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: