2019 ఎన్నికలకు పక్కా ప్లాన్ తో వెళుతున్న జగన్ ..!

KSK
వైసీపీ అధినేత జగన్ విశాఖపట్టణం జిల్లాలో జిల్లా నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లు తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఎన్నికలు దగ్గరలో ఉన్నాయని పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో తెలియజేశారు. ఏపీ నియోజకవర్గ సమన్వయకర్త బాగా కష్టపడాలని రోజుకి రెండు బూతుల లో పర్యటించి వైసీపీ పార్టీ హామీలను సిద్ధాంతాలను గడపగడపకు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమం ఈనెల 17వ తారీకు నుండి ప్రారంభించాలని నియోజకవర్గ సమన్వయకర్తలకు తెలియజేశారు.


ప్రతి నియోజకవర్గ సమన్వయకర్త వారంలో ఐదు రోజుల పాటు బూతు స్థాయిలో ఉన్న కుటుంబాలతో మమేకం కావాలని ఆదేశించారు. ఈ క్రమంలో బూత్ స్థాయిలో ఉన్న ప్రజా సమస్యలు తెలుసుకుని పర్యవేక్షించాలని కోరారు. సమయం తక్కువగా ఉందని,  ఇదే ఆఖరి అవకాశం కాబట్టి సద్వినియోగం చేసుకోవాలని, బూత్‌ కమిటీతో సమీక్ష చేసుకుని, ఓటర్ల జాబితాలో మార్పులు, సవరణలపై దృష్టి పెట్టాలన్నారు.


పాదయాత్ర కొనసాగుతుండగానే నియోజక వర్గాలు, బూత్‌ల వారీగా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. బూత్‌ల సందర్శన మొదటి విడతలో భాగంగా నిర్దేశించిన మొదటి 50 బూత్‌ల సందర్శన మొదటి నెలలోనే పూర్తి చేయాలని సూచించారు. సమస్య ఎక్కడ ఉంటే అక్కడ సరిదిద్దాలని...ప్రతి సమన్వయకర్త 30 నుంచి 35 కుటుంబాలను పూర్తిస్థాయిలో పర్యవేక్షించాలని కోరారు.


ముఖ్యంగా పార్టీ ప్రకటించిన నవరత్న కార్యక్రమాలను సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలియజేయాలని ఈ సమావేశంలో తెలియజేశారు జగన్. ప్రతి వైసీపీ కార్యకర్త నవరత్నాలను ఇంటింటికి తెలియజేయాలని కోరారు. ఇదే క్రమంలో గత ఎన్నికల్లో చంద్రబాబు చెప్పిన అబద్ధాలను మోసాలను ప్రజలకు తెలియజేయాలని పార్టీ సమన్వయకర్తలు కూడా గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద చూస్తే వచ్చే ఎన్నికలకు వైసీపీ అధినేత జగన్ తో పాటు సమన్వయకర్తలు ఇప్పటి నుండే రెడీ అవుతున్నట్లు అర్థమవుతోంది.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: