ఇలా అయితే మరో ప్రజారాజ్యం పార్టీ అవుతుంది జనసేన..!

KSK
ప్రశ్నించడానికి రాజకీయాల్లోకి వచ్చాను..భావితరాల భవిష్యత్ కోసం.. యువకుల కోసం రాజకీయ పార్టీ పెట్టాను అని పెద్దపెద్ద మాటలు చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఎన్నికలు దగ్గరకొస్తున్న కొలది తన ఆలోచన విధానాన్ని మార్చేసుకుంటున్నారు.


రానున్న ఎన్నికల్లో తన  పార్టీ గెలవాలని ప్రజల ఓట్లు కొల్లగొట్టాలంటే ధనవంతుడు బెటర్ అన్నట్టుగా పార్టీలోకి ఎక్కువగా ఆర్థిక బలం ఉన్న వారిని తీసుకోవటం ప్రస్తుతం జరుగుతోంది. ముఖ్యంగా నాకు కులం లేదని చాలా బహిరంగ సభలలో... రాజకీయ వేదికలపై ప్రకటించిన పవన్..ఎన్నికలు దగ్గర పడే కొలది తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు టికెట్లు ఇవ్వడం గమనించదగ్గ విషయం.


మొత్తంమీద తనకు సరుకు ఉన్నోళ్లు కావాలని ఆయనే బైటపడ్డారు. పవన్ కు నిజంగా తనపై, తన ఆశయాలపై, తన ఇమేజ్ పై అంత నమ్మకం ఉన్నోడయితే ప్రతిచోటా కొత్తవారికి టికెట్లు ఇచ్చి గెలిపించుకోవాలి. అప్పుడు తెలుస్తుంది జనసేన సత్తా ఏంటో? పవన్ స్టామినా ఎంత అనేది...అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


ఇలాగే ఎన్నికల వరకు పవన్ వైఖరి కొనసాగిస్తే జనసేన పార్టీని మరో ప్రజారాజ్యం పార్టీ అని ప్రజలు అంటారు అని పేర్కొన్నారు రాజకీయవిశ్లేషకులు. ప్రజారాజ్యం పార్టీలో జరిగిన తప్పులు తన పార్టీలో జరగకూడదని పదేపదే చెప్పే పవన్….టికెట్ల కేటాయింపు విషయంలో పునర్ ఆలోచిస్తే భవిష్యత్తు రాజకీయాల్లో బలమైన రాజకీయ నేతగా ఎదుగుతాడు అని అన్నారు విశ్లేషకులు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: