"ఆపరేషన్ గరుడ" విషయంలో శివాజిని నిఘాసంస్థలు విచారించవలసిన అవసరంలేదా?

"ఆపరేషన్ గరుడ" అంటూ, అదీ చంద్రబాబు నాయుడుపై కేంద్రం చేస్తున్న దాడి అంటూ నానా యాగీ చేస్తున్న శొంఠినేని శివాజి ఒక విషయం గమనించాలి. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నారు. 15పైగా కేసుల్లో విచారణను సైతం కోర్టులు నిలుపుదల  చేయించుకున్న లేదా స్టే తెచ్చుగోగల సామర్ధ్యమున్న ఘనుడు. నాలుగు దశాబ్ధాల సుధీర్ఘ రాజకీయ అనుభవమున్న వ్యక్తి. ఆయన కూడా అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పాలకుడే అదీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేశారు. 

అంతేకాదు మూగ్గురు ప్రముఖులను ప్రధాన మంత్రులుగా సింహాసనం ఎక్కించిన ఘనత ఆయనదే. ఏబి వాజపేయీ, హెచ్ డి దేవెగౌడ మరియు ఐకే గుజ్రాల్ లు దేశ ప్రధానులను చేయటంలో చక్రం తిప్పినట్లు తానే పలుమార్లు చెప్పుకున్నారు కూడా! అంతటి సమర్ధుడు ఆఫ్ట్రాల్ ఒక సాధారణ ఇంకా చెప్పాలంటే ఒక విఫలనటుని సహకారం తీసుకునే అవసరముంటుందా? అనేది కనీస పరిఙ్జానం కలిగిన సామాన్యుని ప్రశ్న. 

శొంఠినేని శివాజీ చేసిన ప్రకటనలు వ్యక్తిగతంగా చంద్రబాబుకు నష్టం కలిగిస్తే ఎవరికీ ప్రమాదం లేదు. ఆయన మాటల్లో నిజ ముంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆయన్ని అదుపులోకి తీసుకొని, ఆయన లేవనెత్తిన అంశాలపై సత్వర విచారణ జరిపించవలసిన అత్యవసరం ఉంది. ఇంకో విషయం ఏమంటే ఆంధ్రప్రదేశ్ ప్రధాన మీడియా కూడా ఈయన ప్రకటనలకు అత్యంత విలువ ఇవ్వటం వలన ఈయన ప్రాధాన్యత సంతరించుకున్నారు. అయితే ఈ ప్రాధాన్యత దృష్ట్యా కూడా శొంఠినేని శివాజి ప్రకటనలలోని ఔచిత్యంపై నేపధ్యంపై ప్రజలకు వివరించవలసిన అవసర్ముంది.

ప్రతి చిన్న విషయాన్ని కేంద్రం ద్రోహచింతనతో చంద్రబాబు నాయుణ్ణి ఏదో చేయాలని అనుకుంటున్నట్లు చిత్రీకరించటం లో నిజమేమైనా ఉందా? అన్న విషయంపై కేంద్రం ప్రభుత్వం కూడా విచారణ జరిపించి ప్రజలకు నిజనిర్ధారణ చేయటం అవసరం. లేకపోతే ఇలాంటి శొంఠినేని శివాజీలు దేశం నుండా పెంటమీద కుక్కగొడుగుల్లా పుట్టుకొచ్చి రాజ్యాంగ వ్యవస్థలపై అందునా బాధ్యతలు నిర్వహించే వారిపై సందేహాలు రేపే అవకాశం ఉంది. ఇలాంటి నేపధ్యంలో ఏ విదేశీ గూఢచర్యమో దాగి ఉందేమో తెలుసుకోవటం అవసరం. ఏవరో విద్రోహశక్తులు ఆయనకు కూడా తెలియకుండా నేపధ్యంలో పనిచేసే అవకాశాల ను పరిశీలించవలసిన అవసరం దేశ సమగ్రత దృష్ట్యా ఉభయ ప్రభుత్వాలకు ఉంది. దేశవిభజన గురించి పదే పదే ఎవరు మాట్లాడతారు? ఆలోచించండి. కేంద్రం పాలన నచ్చకపోతే ఎన్నికలు ఉండనే ఉన్నాయి. రాష్ట్రం గురించి ప్రజలే చూసు కుంటారు.  దేశ సమగ్రతను భంగ పరచపరచే ఈయన ఉద్రేక పూరిత భాషణ ప్రజాస్వామ్యానికి అవసరం లేదు.  

ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబు నాయుణ్ణి ఎంతగా సపోర్ట్ చేసినా శొంటినేని శివాజి మాట్లాడే ప్రకటించే 'ఆపరేషన్ ద్రవిడ' విషయాల్లో ఉన్నఅసలు విషయం "దేశ విభజన" సంభందించిన వ్యాఖ్యలు ఉండటంపైన కూడా విచారించి ప్రజల మనసుల్లో ఆయన వ్యాపింప జేసిన విషయాలలోని వాస్తవం తెలపాలి. శొంఠినేని శివాజి ఏదో వాక్స్వాతంత్రం ఉందని మాట్లాడి ఉంటే దాని ఏదో పిచ్చిచేష్టగా వదిలివేసినా పర్వాలేదు. కాని 'ఆపరేషన్ గరుడ' వగైరా వగైరా లోని నిజా నిజాలు ప్రజలకు తెలియాలి. "చిన్న పాము నైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు కదా!"    
    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: