జనవరి లో ప్రభుత్వం పడిపోతుందా... శివాజీ మాటలు ఎంత వరకు నమ్మొచ్చు...!

Prathap Kaluva

శివాజీ ఇప్పడూ ఈ పేరు సినిమాల్లో కంటే రాజకీయాల్లో తెగ మారు మ్రోగి పోతుంది. ఆపరేషన్ గరుడ అంటూ మళ్ళీ వార్తల్లోకి ఎక్కాడు. ‘ఆపరేషన్ గరుడ’లో చంద్రబాబుకు అరెస్ట్ వారెంట్ జారీ కావడం ప్రారంభం మాత్రమేనని చెప్పారు. ఇది ముందు ముందు కూడా కొనసాగుతుందని హెచ్చరించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు ఉచ్చు వేశారని...దయచేసి ఆ ఉచ్చులో పడకండని ఆయనకు హితవు పలికారు.


ఓ మనిషిని నిర్వీర్యం చేయడానికి నీచంగా ఇన్ని కుట్రలు అవసరమా.. రాజకీయ దాహంతో.. కుర్చీ కాంక్షతో మరి ఇంత దిగజారి ప్రవర్తిస్తున్నారు. అన్యాయంగా చంద్రబాబుకు నోటీసులు పంపారు.. ఈ నోటీసులు ఆరంభం మాత్రమే. నోటీసులకు భయపడి మహారాష్ట్ర వెళ్తే మిమ్మల్ని ట్రాప్‌లోకి దింపుతారు. న్యాయ నిపుణులను సంప్రదించండి.. కోర్టుల్ని ఆశ్రయించండి.. త్వరలో చంద్రబాబుకు మరో రెండు, మూడు నోటీసులు వస్తాయి.


ఈ నోటీసులతో ట్రాప్‌లోకి దించి బాబు గారిని బలి చేయాలనుకుంటున్నారన్నారు’. ‘చంద్రబాబుకు నోటీసులు రాబోతున్నాయంటే చాలామంది ఇష్టానుసారంగా మాట్లాడారు. మరి ఈ నోటీసులు ఎలా వచ్చాయో.. వారు గుర్తు పెట్టుకుంటే మంచిది. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. పాలన సరిగా లేకపోతే ప్రజలు తిరస్కరిస్తారు.. అలాంటి ప్రభుత్వాన్ని మీరు ఎలా కూలదోస్తారు. జనవరిలో ఎన్నికలొస్తాయని జగన్ ఎలా చెబుతారు.. ఎలా వస్తాయో నాకు తెలుసు. చంద్రబాబుకు నోటీసులు పంపి.. కేసుల్లో ఇరికిస్తారు. ఎమ్మెల్యేలంతా చీలిపోతారు.. ఆ తర్వాత చంద్రబాబు పదవిని నుంచి దిగిపోతే.. రాష్ట్రపతి పాలన వస్తుంది. అప్పుడు జనవరిలో ఎన్నికలు వస్తాయి.. అదే కుట్ర జరగబోతోందన్నారు’శివాజీ. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: