కేరళ పోలీసులు ఇస్రో మాజీ శాస్త్రవేత్తకు చేసిన అన్యాయానికి సుప్రీం కోర్టు తీర్పు చెంపపెట్టు

అంతరిక్ష పరిజ్ఞానాన్ని అమ్ముకున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్న ఇస్రో మాజీ శాస్త్రవేత నంబి నారాయణన్ సుప్రీం కోర్టు  భారీ ఊరట కల్పించింది. 1994 నాటి ఇస్రో గూఢ చర్యం కేసులో కేరళ పోలీసులు నారాయణన్ (76) ను అనవసరంగా అరెస్టు చేసి, బాధపెట్టి, మానసిక వేధింపులకు గురి చేశారని సుప్రీం ప్రధాన న్యాయ మూర్తి దీపాక్ మిశ్రా నేతృత్వం లోని ధర్మాసనం పేర్కొంది.  


అందుకు గాను ఆయనకు ₹ 50 లక్షలు నష్ట పరిహారం పోలీసులు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అంతే కాదు ఈ కేసు విచారణ లో కేరళ పోలీసుల పాత్రపై దర్యాప్తు చేసేందుకు మాజీ  న్యాయమూర్తి డికె జైన్ నేతృత్వంలో జస్టిస్ ఎ ఎన్ ఖాన్విల్కర్, డి వై చంద్రచూడ్‌ తో కూడిన త్రిసభ్య కమిటీ ని ఏర్పాటు చేసింది.
నంబినంబినారాయణన్‌ 1991లో ఇస్రో క్రయోజెనిక్ టెక్నాలజీ అభివృద్ధి ప్రాజెక్టు డెరైక్టర్‌ గా పనిచేశారు. అంతరిక్ష కార్యక్రమ వివరాలను అమ్ము కున్నారు 
అనే, ఆరోపణపై 1994లో ఆయనను ఆరెస్టు చేశారు. అయితే 1998లో సుప్రీంకోర్టు ఆయనపై కేసు కొట్టివేసింది. నంబి నారాయణన్, శశికుమరన్‌ లను నిర్దోషులుగా ప్రకటించింది. దీంతోపాటు ఒక లక్ష రూపాయిల నష్ట పరిహారాన్ని చెల్లించాలంటూ కేరళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మాజీ పోలీస్ డీజీపీ మాథ్యూ, ఇద్దరు రిటైర్డ్ పోలీస్ సూపరింటెండెంట్స్‌, కె.కె. జాషువా, ఎస్. విజయన్‌ లు అక్రమ కేసులతో తనను మానసిక వేదన, హింసకు గురి చేశారని ఆరోపిస్తూ వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా నంబినారాయణన్‌  నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్ - ఎన్‌హెచ్‌ఆర్‌సీలో పిటిషన్‌ వేశారు. కోటి రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలని కోరారు. 

1998 సుప్రీం తీర్పును పరిగణనలోకి తీసుకున్న 'నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్' వాదనల అనంతరం, మార్చి 2001 లో నారాయణన్‌ కు ₹ 10 లక్షల తాత్కాలిక పరిహారం చెల్లించాలని తీర్పు చెప్పింది. దీన్ని కేరళ హైకోర్టు కూడా సమర్ధించింది.  అయితే 2015లో పోలీసు ఉన్నతాధికారులపై క్రమశిక్షణా, క్రిమినల్‌ చర్యలు తీసు కోవాల్సిందిగా కోరుతూ నారాయణన్‌ తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై తాజా తీర్పును సుప్రీంకోర్టు  వెలువరించింది

SC awards Rs 50 lakh compensation to ex-ISRO scientist Nambi Narayanan in espionage case

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: