మంత్రి లోకెష్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం - పెయిడ్ ఆహ్వానం ఖర్చు తడిసి మోపెడు? ప్రయోజనం?

frame మంత్రి లోకెష్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం - పెయిడ్ ఆహ్వానం ఖర్చు తడిసి మోపెడు? ప్రయోజనం?

దుబారా సామ్రాజ్యమైన  ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధికి మోక్షం లేదు. ఇది అందరికి కనిపిస్తున్న నగ్నసత్యం. ఈ ప్రభుత్వం మొత్తం ప్రచార పటాటోపంతో నెట్టుకొస్తుంది. ఎన్నికల వాగ్ధానాల నుండి పాలనాపరమైన విషయాల వరకు అంతా ప్రచార పటాటోపమే. నిజంగా చెప్పాలంటే పావలా కోడికి ముప్పావలా మసాలా అనే నానుడి అక్షరాలా ఇక్కడ నాలుగున్నరేళ్లుగా ఋజువు అవుతూ వస్తుంది. 

నారా చంద్రబాబు నాయుణ్ణి  ప్రస్తుతం ఐఖ్యరాజ్య సమితిలో ప్రసంగం కోసం ఆహ్వానం అందింది. ఇప్పుడు ఆయన తనయుడు లోకేష్ నాయుడికి భారత్ నుండి ఒకే ఒక్కడుగా  “వరల్డ్ ఎకనమిక్ ఫోరం న్యూ చాంపియన్స్ సమ్మిట్ కోసం ఇటీవల చైనా రావలసిందిగా ఆహ్వానం అందుకున్నారు.   
Image result for nara lokesh has been invited by world economic forum new champions summit

ఇప్పుడు అమరావతి ప్రజల అనుమానం ఏమంటే  ఈ గౌరవం నూట ఇరవై కోట్ల పైగా జనాభా ఉన్న భారత్ లో ఒక్క నారా లోకెషును మాత్రమే ఎందుకు వరించింది?  అనేక రాష్ట్రాల్లో యువ మంత్రులు ఉన్నారు కదా! వారికెవరికి లేని ప్రత్యేకత వీరికేముంది అన్నది వారి డౌట్. అయితే అలోచించి తరచి చూస్తే  కారణం బహుశ 2019 చివరి వరకే ఒక లక్ష ఉద్యోగాలు సృష్టిస్తానన్న ఈ ఆర్ధికవేత్తలోని సృజనాత్మక  నైపుణ్యాన్ని గమనించి, ఈ మహత్తర కార్యక్రమానికి ఆహ్వానించి ఉండవచ్చని విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. 
Image result for nara lokesh has been invited by world economic forum new champions summit

On Day 1, met HERE Technologies' Head of Global Operations Ms. Melody. Headquartered at Amsterdam, they offers services in the areas of Map Content, ...


అసలు జోకేంటంటే, ఒక ప్రముఖ తెలుగు వెబ్-సైట్ అభిప్రాయం ప్రకారం,  ఇలాంటి ఆహ్వానాలు రప్పించు కోవటానికి చాలా పెద్ద మొత్తంలో సొమ్ములు చెల్లించారట. అయితే ఈ ప్రతిష్టాత్మక రుసుమును జాస్తి కృష్ణ కిషోర్ చౌదరిగారి ఆద్వర్యంలో దిగ్విజయగా నడిచే "ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మండలి" చెల్లించినట్లు చెపుతున్నారు. ప్రవేశ రుసుముతో పాటు అక్కడ మంత్రి నారా లోకేష్ గారి ప్రయాణం, వసతి, ఆహారం, రవాణా, ఇతర విలాసాలకు అయ్యే ఖర్చులు కూడా ఏపి డెవలప్మెంట్ బోర్డే చెల్లిస్తుందట.  



భారత్ లో తెలంగాణాతో కలిపి ఏ ఇతర రాష్ట్రం కూడా ఈ  అద్భుత అంతర్జాతీయ కార్యక్రమానికి తమ ప్రతినిధులను పంపుతున్న దాఖలాలు కనిపించట్లేదు. లేకపోతే వారికి ప్రచార పటాటోపం, హంగామా, హల్-హల్ అవసరంలేదేమో? కనీసం ఏ రాష్ట్రం కూడా దీన్ని విచక్షణ లోకి తీసుకోదగినత విలువ ఉన్నదిగా భావించలేదేమో? ఆర్ధికంగా సుసంపన్న వంతమైన రాష్ట్రాలే ఏవరిని ఈ కార్యక్రమానికి నామినేట్ చెయ్యకపోవటం ఆంధ్ర ప్రదేశ్ మాతమే ఈ యువ మంత్రి గారిని ప్రతినిధ్యం వహించమని పంపటం, లెదా పిలుపు రావటం లోని అతి రహస్యం ఏమై ఉంటునని విఙ్జులు విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.


ఈ అంతర్జాతీయ సమ్మిట్ ఆహ్వానం లోకేష్ కు రాగానే కాష్మోరా నిద్రలేచి అల్లకల్లోలం సృష్టించినట్లు ఆంధ్రా అధికార బాబుల మానసపుత్రికలైన, పచ్చ మీడియా పచ్చపచ్చగా ప్రపంచంలోనే ఇంత గొప్పనాయకుడు లేడన్నట్లుగా వార్తల వంటకం వండి వడ్దించటం జరిగి పోతున్నాయి. ఇంకా వారి వారి స్వంత సామాజిక మీడియాలో దీన్ని లోకేష్ బాబు నైపుణ్యం ఏపికి సాధించి పెట్టిన  గౌరవ పురస్కారం గా యెత్తేస్తుంది.


ప్రస్తుతానికి యెత్తేస్తున్నా–అధికారాంతమందు “ఎత్తి కుదెయ్యక పోతే చాలు!” అంటోంది ప్రజావాణి.  స్వంత వెబ్-సైట్ కూడా నిర్వహించుకోలేని కంపెనీలను ప్రతిష్టాత్మకమైనవిగా  ప్రచారం చేస్తూ – వాటి తోనే మెమోరాండం ఆఫ్ అండర్-స్టాండింగు లపై సంతకాలు చేస్తూ రాష్ట్రం లోని నిరుద్యోగుల మొత్తం సంఖ్యకు మించిన్న ఉద్యోగాలిచ్చినట్లు ప్రచారం నిరంతరం చేసుకునే తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకిచ్చేది శుష్కప్రియాలు శూన్య హస్తాలు మాత్రమే. ఇక ఈ లోకెషు బృందంతో  ప్రయాణించనున్న వారికి రూట్ కెనాల్ సమస్య లేకుండా ఉండాలి! అని అమరావతి వాసులు ఆ నగర అదృష్టప్రధాయిని, ఇంద్రకీలాద్రిపై నెలవై ఉన్న ముగురమ్మల మూల పుటమ్మను  ప్రార్ద్దిస్తున్నారట.  

Naidu's title 'youth icon' for son Nara Lokesh draws flak from Twitterati

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: