త్వరలో చంద్రబాబు పై గవర్నర్ కు కంప్లైంట్ ఇవ్వనున్న కేసీఆర్..!

KSK
టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై మండిపడ్డారు. ఏపీ పోలీసులను తన స్వార్ధ రాజకీయాలకోసం వాడుకుంటున్నారని అభిప్రాయపడుతున్నారు కేసీఆర్. విభజన నేపథ్యంలో హైదరాబాదు నగరంలో సెక్షన్ 8 అమలు చేయడం లేదని గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉమ్మడి గవర్నర్ నరసింహన్ పై విమర్శలు చేసేవారు.


అయితే తాజాగా సెక్షన్ 8 నీ అడ్డంపెట్టుకుని చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని...ఈ పరిణామంతో కెసిఆర్ గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అన్ని ఆఫీస్ లను ఖాళీ చేసి అమరావతికి వెళ్లిపోయాక, ఇప్పుడు మళ్లీ పోలీస్ నిఘా విభాగాన్ని హైదరాబాద్ లో దింపి చంద్రబాబు తెలంగాణలో సర్వేలు చేయిస్తున్నారని కెసిఆర్ ఆగ్రహంగా ఉన్నారు.


అంతేకాక టిఆర్ఎస్ నుంచి కొందరిని ఆకర్షించడానికి కూడా చంద్రబాబు ఈ నిఘా సిబ్బందిని వాడుకుంటున్నారని, జిల్లాల నుంచి టిఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రికి తెలిపారు.దాంతో ఈ అంశంపై కెసిఆర్ సీరియస్ గా ఉన్నారని ఒక ఆంగ్ల పత్రిక కధనం ఇచ్చింది.


త్వరలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు మహా కూటమి కోసం తెలంగాణాలో ఏపీ పోలీసు నిఘా వ్యవస్థను వాడుకుంటున్నట్లు గా గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేయాలనే భావనలో ఉన్నారు కెసిఆర్.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: