టిఆరెస్ ఒటమికి కాంగ్రెస్ పాదాల చెంత మోకరిల్లటానికి టిడిపి సిద్దమౌతుంది : 10 సీట్లు చాలు టిడిపి


తెలంగాణా రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ప్రాధమ్యాలు మారిపోయాయి. ఇక్కడ టిడిపి అంటే ఆంధ్రోళ్ళ పార్టీగా పేరుంది అంతకుమించి టిడిపి నారా చంద్ర బాబు నాయుడి స్వంత కులం కమ్మ వారికే చెంది వారి ఆధిపత్యమున్న పార్టీగా ఇక్కడి జనం ఎప్పుడో గుర్తించారు. కారణం ఇక్కడ వాళ్ళ సామాజికవర్గ జనాభా అధికంగా ఉన్న కూకటపల్లిపై వారికి వ్యామోహం ఉండటం ప్రధాన కారణం. అందుకే తెలంగాణా రాష్ట్ర తొలి ఎన్నికలో కెసీఆర్ టిఆరెస్ దెబ్బ నుండి తప్పించుకోవటానికి ఈ ప్రాంతంలో నివసించే ఈ వర్గ ప్రజలు టిఆరెస్ ను గెలిపించటానికి బాగా కృషి చేశారు.  ఇప్పుడు కాస్త ఊఇరి పీల్చుకొని స్వతంత్రంగా తమ పార్టీ గెలుపుకు పనిచేయాలన్న తెగింపు వారిలో వచ్చిందని విశ్లేషకుల అభిప్రాయం. ఏదేమైనా తెలంగాణా ప్రజల స్మృతిపథం నుండి ఓటుకు నోటు కేసులోని చంద్రబాబు నేరస్వరూపం మటుమాయం కాలేదు. అలాగే దళితుల్లో మోత్కుపల్లి నరసింహులును టిడిపి అధినేత చంద్రబాబు వంచించిన తీరు, ఆపై మోత్కుపల్లి ఆవేదన దళితులే కాదు సాధారణ  తెలంగాణా జనం కూడా మరచిపోలేదు.  
   
అందుకే  తెలంగాణ తెలుగు దేశం పార్టీ తన పంథాను మార్చుకున్నట్టు వార్తలొస్తున్నాయి. మహాకూటమిలో ఏర్పడ్డ ప్రతిష్టంభనకు తెరదించడానికి.. సీట్ల సర్దుబాటు కావడానికి టీడీపీ నేతలు "పెద్ద స్కెచ్చే వేసినట్లు"  సమాచారం. ఇందులో భాగంగా ఇప్పటి వరకూ 30నుంచి 35సీట్ల వరకూ డిమాండ్ చేస్తూవచ్చిన టీడీపీ, ఇప్పుడు కేవలం గెలిచే సీట్లను మాత్రమే, తమకు కేటాయించాలని కాంగ్రెస్ కు పూర్తిగా దాసోహం అన్నట్లు వాతావరణం మారిపోయినట్లు సమాచారం. అందుకే అతి స్వల్ప సంఖ్య అంటే పదికి లోపే తాము గెలవగల సీట్లు మాత్రమే కేటాయించాలని కాంగ్రెస్ ముందు మోకరిల్లుతూ ప్రతిపాదన పెట్టబోతున్నదని సమాచారం. ఇందుకోసం పక్కాగా ప్లాన్ కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది..

టీడీపీ ఈ నిర్ణయం వెనుక బలమైనకారణమే ఉంది. 30 సీట్లు అడిగినా కాంగ్రెస్ ఇచ్చే పరిస్థితి లేదు. పదుల సంఖ్యలో సీట్లు తీసుకొని ఓడిపోయే కంటే బలమున్న చోట, గెలిచే సీట్ల లోనే పోటీచేస్తే పార్టీకి మహాకూటమికి బలమని భావిస్తోంది. అందుకే టీడీపీలో ఉన్న బలమైననేతలు, వారు కోరుకునే సీట్లను మాత్రమే అడగాలని టీడీపీ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా హైదరాబాద్ లో రెండు నుంచి మూడు సీట్లు మాత్రమే అడగాలని నిర్ణయించుకుందని — కూకటపల్లి - ఉప్పల్ నియోజకవర్గాలు తప్పని సరిగా కావాలని కోరడంతో పాటు జూబ్లిహిల్స్ లేదా  శేర్లింగంపల్లి నియోజకవర్గాల్లో ఏదో ఒకటి కావాలని ప్రతిపాదన పెట్టబోతోందట.

ఇక తెలంగాణ వ్యాప్తంగా మక్తల్ నుంచి టీడీపీ సీనియర్ నేత దయాకరరెడ్డి, నర్సంపేట నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి, కోదాడ నుంచి మల్లయ్య యాదవ్, మరియు సత్తుపల్లి నుంచి సండ్ర వెంకట వీరయ్యలకు టికెట్ ఇప్పించాలని ప్రతిపాదన చేయబోతున్నట్లు  వీరంతా ఆయా నియోజకవర్గాల్లో బలమైన నేతలుగా ఉండడం, గెలిచే అవకాశాలుండడంతో ఈ సీట్లనే అడగాలని టీడీపీ నిర్ణయించుకుందని తెలిసింది. ఇలా గెలిచే సీట్ల లోనే పోటీచేసి టీఆర్ఎస్ ను ఓడించాలని టీడీపీ వేసిన ఈ ప్లానుకు కాంగ్రెస్ నుంచి కూడా సానుకూల సంకేతాలే వచ్చినట్టు తెలిసింది. ఇలా జరిగితే టిఆరెస్ ను ఓడించవచ్చని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారట. ఇక్కడ ఇలా కానిచ్చి ఆ బదులును తిరిగి రేపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎలాగు తనదే ఆధిపత్యం కనుక పొందవచ్చనేది టిడిపి భావన. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: