ఆ పార్టీలోకి స్టార్ కమెడియన్...ఓ రేంజిలో ఊపొస్తుందా !!

frame ఆ పార్టీలోకి స్టార్ కమెడియన్...ఓ రేంజిలో ఊపొస్తుందా !!

Satya
సినిమా నటులు, రాజకీయాలు కలగలసిపోయి చాలా కాలమే అయింది. తెలుగునాట నటులు పాలిటిక్స్ లొకి  వచ్చి సక్సెస్ అయిన వారూ ఉన్నారు. ఫెయిల్ అయిన వారూ ఉన్నారు. మరిపుడు ఓ ప్రముఖ హాస్య నటుడు రాజకీయాల్లొకి వచ్చేస్తున్నారు. ఆయన వస్తే ఆ పార్టీకి ప్లస్ అవుతుందని అంటున్నారు.


పవన్ తో ఆలీ :


పవన్ తో అనేక సినిమాల్లో నటించిన ఆలీ ఆయన పెట్టిన జన సేన‌ పార్టీలోకి వస్తున్నరట. ఇది కన్ ఫర్మ్ న్యూస్ అంటున్నారు. పవన్ కి ఆలీకి ఉన్న అనుబంధం తెలిసిందే. అలీ నా పక్కన లేకపోతే సినిమాల్లో నటించను అన్నది పవన్ మాట. ఇక. పవన్ రాజకీయాల్లోకి వస్తే పక్కన నేనుంటాను అని ఆలీ అప్పట్లో అన్నారు. అది ఇన్నాళ్ళకు నిజం కాబోతోంది.


గుంటూర్ నుంచి :


గుంటూరు నుంచి ఆలీ పోటీకి రెడీ అంటున్నారు. గుంటూరు తూర్పు నుంచి అసెంబ్లీకి ఆలీ  పోటీకి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఇక్కడ అధికంగా మైనారిటీలు ఉండడంతో ఆలీ కి సరైన సీటు అంటున్నారు. పోయిన ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైసీపీ తరఫున మహమ్మద్ ముస్తాఫా షేక్ గెలిచారు. దీంతో ఆలీ ఇదే తనకు సేఫెస్ట్ సీటు అనుకుంటున్నారుట. 


అక్కడ ఆ ఇద్దరూ :


రేపు (ఆదివారం) రొట్టెల పండున వేళ పవన్ తో కలసి ఆలీ కనిపిస్తారని చెబుతున్నారు. నెల్లూరులో జరిగే ఈ కార్యక్రమమే ఆలీ జనసేనలో చేరే ముహూర్తం షాట్ కానుందని అంటున్నారు. వెండి తెరపై  సూపెర్ హిట్ కాంబో అయిన ఈ ఇద్దరూ రాజకీయాల్లోనూ కలసి అడుగులు వేస్తున్నారు. మరి ఎన్వరకు జనం ఆదరిస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: