టిడిపి ఆయువుపట్టు ప్రాంతంపై దెబ్బ కొట్టిన జగన్..!

KSK
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుండి ఉత్తరాంధ్ర ప్రాంతం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా గత కొన్నాళ్ల నుండి వస్తూనే ఉంది. 2014 ఎన్నికలలో కూడా తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో చాలా సీట్లనే గెలుచుకోవడం అందుకు నిదర్శనం. ఈ క్రమంలో ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ప్రతిపక్ష నేత జగన్ మొదలుపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఆంధ్ర రాజకీయాలలో రాజకీయాన్ని వేడెక్కించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.


ఈ క్రమంలో ఇప్పటికే కొన్ని జిల్లాలలో పాదయాత్ర ముగించుకుని ఇటీవల ఉత్తరాంధ్ర ప్రాంతంలో అడుగుపెట్టిన జగన్ కి విశాఖలో అద్భుతమైన స్వాగతం లభించింది ఈ విషయం మనకందరికీ తెలుసు. ఇదిలా ఉండగా ప్రస్తుతం తాజాగా విజయనగరం జిల్లాలో జగన్ అడుగు పెట్టారు.


ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది నాయకులు వైసీపీ పార్టీ కి ఏకంగా ఫ్లెక్సీలు కట్టడం మొదలుపెట్టారు..అంతేకాకుండా జగన్ పాదయాత్ర ని అడ్డుకునే విధంగా..జగన్ పాదయాత్రకు మద్దతు తెలిపే ప్రజలకు ఆటంకాలు కలిగించే విధంగా తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది నాయకులు బాణాసంచా కాల్చడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.


ఈ క్రమంలో తన పాదయాత్ర తో ఉత్తరాంధ్రలో దూసుకుపోతున్న జగన్ కి చెక్ పెట్టడానికి..చంద్రబాబు ఇటీవల అమెరికా పర్యటన వెళ్లకముందు విజయనగరం ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశమయ్యి పాదయాత్రపై అలెర్ట్ చేశారు. ఎట్టి పరిస్తితుల్లో మైలేజ్ జగన్ కి దక్కకుండా చూడాలని ఆదేశించారు. దీంతో అశోక్ గజపతిరాజు, మంత్రి సుజయ క్రిష్ణ రంగారావు, పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులంతా కౌంటర్ అటాక్ చేస్తూ రెడీ అయిపోయారు. మరి వైసీపీ మరో వైపు మోహరించి ఉన్న వేళ జిల్లా రాజకీయం ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: