నేరస్తుడిగా నిర్దారణ కాకముందే ముద్ధాయిని ఎన్నికల్లో పాల్గొనకుండా నిరోధించలేం: సుప్రీం

ప్రజాశ్రేయస్సు కోరే నాయకుల పరిపాలనలో ప్రజాస్వామ్యం కొనసాగే హక్కు భారత సమాజానికి ఉందని, క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న నేతలను ఏ మాత్రం క్షమించ కుండా అగాథంలోకి నెట్టాల్సిందేనని ఒక కేసు విచారణలో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్ట్ స్పష్టం చేసింది. సాధ్యమైనంత త్వరలో దీనిపై సమగ్ర చట్టం చేయా లని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన దీపక్ మిశ్రా నాయకత్వంలోని ధర్మాసనం పార్లమెంటుకు  సూచించింది.
 
నేర ఆరోపణతో విచారణ ఎదుర్కొంటున్న చట్టసభల సభ్యులు దోషులుగా న్యాయస్థానాలు ప్రకటించక ముందే వారిపై అనర్హత వేటు వేయలేమని నేడు భారత సర్వోన్నత న్యాయస్థానం నేడు వెల్లడించింది. కేంద్ర ఉభయ సభల సభ్యులు రాష్ట్ర శాసనసభ సభ్యుల లపై నేరారోపణలతో కేసులు నమోదైతే వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించమ్ని లేదా అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ సుప్తీం కోర్ట్ లో దాఖలైన దరకాస్తులపై (పిటిషన్లపై) సర్వోన్నత న్యాయస్థానం నేడు కీలక తీర్పు వెల్లడించింది. 
కేవలం అభియోగాలు ఆరోపణలు నమోదైనంతమాత్రాన వారిపై అనర్హత వేటువేయలేమని సుప్రీం కోర్ట్ తమ అభిప్రాయాన్ని వెలువరించింది. అయితే వారు ఎన్నికల్లో పోటీ చేయొచ్చో? లేదో? అన్న విషయాన్ని పార్లమెంట్‌ విచక్షణకే వదిలేస్తున్నట్లు స్పష్టం చేసింది.

ప్రస్తుతం ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం, ఒక క్రిమినల్‌ కేసు లో దోషి గా తేల్చబడ్డాకే చట్టసభల సభ్యులపై అనర్హత వేటు పడుతుంది. అయితే అభియోగాల నమోదు దశ నుంచే ఎన్నికల్లో పోటీ చేయకుండా వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ 'పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ ఫౌండేషన్‌' అనే స్వచ్ఛంద సేవా సంస్థతో పాటు భాజపా నేత అశ్వనీ కుమార్‌ ఉపాధ్యాయ్‌ లు సుప్తీం కోర్ట్ లో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం నేడు తీర్పు వెలువరిచింది.

‘క్రిమినల్‌ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న చట్టసభల సభ్యులపై అనర్హత వేటువేసే స్థాయిలో న్యాయ స్థానం లేదు. ఈ విషయంలో లక్ష్మణ రేఖ దాటలేం. అయితే నేరస్థులను చట్టసభ లకు దూరంగా ఉంచాల్సిన సమయం వచ్చింది. క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న నేతలు ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అన్నది పార్లమెంట్‌ విఙ్జతకే  వదిలేస్తున్నాం. దీనిపై పార్లమెంట్‌ ఒక సమగ్ర చట్టం తీసుకురావాలి’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేగాక, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులు నమోదైతే వాటికి సంబంధించిన వివరాలను ఆ అభ్యర్థులు ఎన్నికల అఫిడవిట్‌ లో తప్పనిసరిగా పేర్కొనాలని తెలిపింది. పార్టీలు కూడా తమ అభ్యర్థుల కేసుల వివరాలను వెబ్‌సైట్లలో పొందుపర్చాలని ఆదేశించింది.


"నేటి ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడక ముందే వీలున్నంత త్వరగా ఈ చట్టాన్ని తీసుకురావాలి" అని భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. కోర్టులో అభియోగాలు ఎదుర్కొంటున్న నేతలను ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధించాలంటూ దాఖలైన పై రెండు పిటిషన్లను కొట్టివేస్తూ, సుప్రీం ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. ప్రస్తుత చట్టాల ప్రకారం రాజకీయ నేతలు నేరం చేసినట్టు రుజువైతే ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం ఉంది. 

అయితే దోషులుగా తేలిన నేతలు రాజకీయ పార్టీలకు నాయకత్వం వహించకుండా అడ్డుకునే అవకాశం లేదు. ప్రస్తుతం దేశం లోని చట్టసభల సభ్యులు (ఎంపీ & ఎమ్మెల్యేలు) సహా 1,765 మంది ప్రజా ప్రతినిధులు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నట్టు మార్చిలో కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు నివేదించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: