జగన్ ని బదనాం చేస్తారట !!

Satya
ఏపీ కాంగ్రెస్ తీరు మారిపోయింది. నిన్నటి వరకూ మోడీ బాబుని కలిపి తిట్టిన ఆ పార్టీ ఇపుడు మోడీ జగన్ అంటోంది. బాబు బేజేపీ నుంచి విడిపోయాక, కర్నాటకలో కన్ను కొట్టాక. తెలంగాణాలో జట్టు కట్టాక ఏపీలోనూ కలసిపోయేందుకు రెడీ అవుతున్న టైంలో బాబు ను ఏం అనొద్దంటూ ఖద్దరు పెద్ద తలకాయలు రంగంలోకి దిగుతున్నాయట. బాబుని అంటే తట్టుకోలేని భజంత్రీ మేళం ఏపీ కాంగ్రెస్ లో అపుడే తయారైపోయింది


కేవీపీకి షాక్ :


ఏపీలో కాంగ్రెస్ ని ఒడ్డున పడేద్దామనుకునే నాయకుల్లో కేవీపీ రామంచంద్రరావు ఒకరు. ఆయన ప్రత్యేక హోదా పైన పోరాడుతున్నారు. అలాగే పోలవరం పైనా అంతే దూకుడు ప్రదర్శిస్తున్నారు. మరి కాంగ్రెస్ కి ఉత్తేజం కోసం, ప్రచారం కోసం రూపకల్పన చేసిన ఓ షార్ట్ ఫిల్మ్ లో హోదా, పోలవరం వంటి వాటి విషయాల్లొ బాబు చేసిన దగానంతా చూపించారట. ఘాటుగా విమర్శలూ ఉన్నాయట.


శీల పరీక్ష :


మరి కాంగ్రెస్ మాజీ మంత్రి జేడీ శీలం దీనిపై అభ్యంత్రం వ్యక్తం చెస్తూ ఏంటిది డాక్యుమెంట్ ఫిల్మ్ లా వుంది. బాబుని తిట్టడమేంటసలు, జగన్ మనకు ప్రధాన శత్రువు ఆయన్ని ఎంత తిడితే అంతలా మనం బలపడతామంటూ సలహాలు ఇచ్చారట. జగన్ పైనే మన గన్ ఉండాలని కూడా చెప్పారట.


బంధం బిగిసిందా :


రెండు పార్టీలు ఏపీ వరకు ఊసులు ఆడుకునే స్థాయిలోనే ఉన్నాయి. మరి ఇంతలోనే బాబు ని ఏమీ అనవద్దు అంటూ కాంగ్రెస్ లో పెద్ద గొంతులు  అంటున్నాయంటే రేపటి రోజున పొత్తు పొడుపుకు ఇది బలమైన సూచిక అనిపిస్తోంది. ఇక కేవీపీ రూపొందించిన షార్ట్ ఫిల్మ్ లో తప్పెంటో అర్ధం కాదు, ఏపీలో ఉన్నది, పాలిస్తున్నది చంద్రబాబు, అధికార పార్టీని వదిలేసి ఎక్కడైన ప్రతిపక్షాన్ని విమర్శిస్తారా విడ్డూరం కాకపోతే. దీన్ని బట్టి కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో జగన్ పై ఎలా బురద జల్లాలో డిసైడ్ అయినట్లుంది. .ఈ ఒక్క పాయింటు చాలదూ  బాబు కాంగ్రెస్ ని కలసి కౌగలించుకోవడానికి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: