పవన్ మళ్ళీ చంద్ర బాబు కు మద్దతు ఇస్తాడా... తెర వెనుక ఏం జరుగుతుంది...!

Prathap Kaluva

పవన్ కళ్యాణ్ టీడీపీ నుంచి బయటికొచ్చేసి ఆ పార్టీ నీ ఓ రేంజ్ లో విమర్శిస్తున్నారు. అయితే జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ఉన్నట్లుండి తెలుగుదేశం పార్టీకి దూరం జరిగి, ఆ విధంగా ముందుకు వెళ్తున్నారు. అలా దూరంగా జరిగిన తరువాత సంగతి ఏమో కానీ మళ్లీ ఈ మధ్య పవన్ కు తెలుగుదేశానికి మధ్య కనిపించమని బంధాలు పెనవేసుకుంటున్నాయన్న వదంతులు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.


ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ తమ పార్టీ జనాలకు, అలాగే పార్టీకి మద్దతుగా నిలిచిన మీడియాకు క్లియర్ ఇన్ స్ట్రక్షన్స్ ఇచ్చేసారన్న విషయం లోలోపల వినిపిస్తోంది. పవన్ పై ఎటువంటి విమర్శలు చేయవద్దని పార్టీ శ్రేణులకు ఆదేశాలు అందాయని టాక్. అలాగే తమ అనుకూల మీడియా కూడా పవన్ విషయంలో కాస్త న్యూట్రల్ గా వ్యవహారించాలని రిక్వెస్ట్ లు, ఆదేశాలు వెళ్లినట్లు వినిపిస్తోంది.


క్షణాల్లో మహాటీవీలో మహామూర్తి ఉద్యోగం వదిలి వెళ్లడం వెనుక, ఆ కార్యక్రమాన్ని అకస్మాత్తుగా ఆపేయడం వెనుక ఈ వ్యవహారమే వుందని తెలుస్తోంది. అదే సమయంలో మూర్తికి పునరావాసం కల్పించడంలో కూడా లోలోపల చాలా వ్యవహారాలు నడచాయని వినిపిస్తోంది. ఎన్నికల అనంతరం కానీ పవన్ సత్తా ఏమిటో? జగన్ బలం ఎంతో, తెలుగుదేశం పరిస్థితి ఏమిటో తెలియదు. కర్ణాటక లాంటి పరిస్థితి ఏర్పడితే పవన్ తో అవసరం పడుతుంది. అందుకే ఇప్పటి నుంచీ పవన్ పట్ల సానుకూల దృక్పథంతో చంద్రబాబు అండ్ కో వుంటున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: