షాక్..నేలను తాకిన మబ్బులు!

Edari Rama Krishna
సాధారణంగా ఆకాశంలో మబ్బులు దట్టంగా ఉంటే..ఈ రోజు వర్షం జోరుగా కురుస్తుందని అనుకుంటాం.  ఇక పాత కాలం సినిమాల్లో దేవుళ్లను మబ్బుల్లో చూపించడం చూశాం..అంటే దేవుళ్లు నిజంగా మబ్బుల్లో ఉంటారన్న అనుమానాలు కూడా కలుగుతుంటాయి.  అలాంటి మబ్బులు భూమిని తాకడం అస్సలు ఊహించలేం..కానీ ఇప్పుడు చైనా లోని జిన్ జియాంగ్ నగరంలో ఈ రోజు ఒక అద్భుతమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. 

చైనాలోని జిన్ జియాంగ్ నగరంలో మనం ఎప్పుడు చూడని ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడ హై వే మీద మబ్బులు భూమి పై వచ్చి పడ్డాయ్, ఆ దృశ్యాన్ని మీరు వీడియో లో చూడవచ్చు.ఈ ప్రాంతం చుట్టూ ఎత్తైన కొండలు, ఎడారి ఉన్న కూడా ఇలా జరగటంతో అక్కడ ఉన్న ప్రజలు సైతం ఆశ్చర్య పోయారట.
 
ఇలా మబ్బులు రోడ్ పైకి రావటంతో ట్రక్ డ్రైవర్లు ఒక్కసారే షాక్ తిన్నారు. అ మబ్బుల్లోంచి వెళితే ఏదైనా ప్రమాదం జరగొచ్చని వాహనాలు అక్కడే ఆపి ఆ దృశ్యాన్ని తమ కెమెరాల్లో బంధించారు.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ వీడియోని నిర్మాత నీలిమ తిరుమలశెట్టి షేర్ చేయటం విశేషం.
The clouds in Xinjiang fell to the ground! The truck drivers are afraid to move forward(due to the water vapor in the cloud being too heavy).This natural phenomenon is very rare. pic.twitter.com/A1cFd2DQfg

— NeelimaTirumalasetti (@TheNeelima) September 26, 2018

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: