2019 ఎన్నికలకు జగన్ తీసుకున్న సరికొత్త సంచలన నిర్ణయం..!

KSK
తన పాదయాత్రతో ఆంధ్రాలో వైసిపి పార్టీ గ్రాఫ్ అమాంతం పెంచేసిన ప్రతిపక్ష నేత వైసీపీ నేత జగన్ రాబోయే 2019 ఎన్నికలలో తన పార్టీ తరఫున నిలబడే అభ్యర్థుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 2014 ఎన్నికలలో మాదిరిగా కాకుండా ఆంధ్ర రాజకీయాల భవిష్యత్తును మార్చేలా జగన్ తాజాగా తీసుకునే నిర్ణయాలు బట్టి అర్థమవుతుంది.


ముఖ్యంగా రాబోయే ఎన్నికలలో వైసీపీ పార్టీ తరఫున నిలబడే అభ్యర్థుల విషయంలో జగన్ ఎక్కువగా సీనియర్ల కంటే యువరక్తం కలిగిన వారికే ప్రాధాన్యతనిస్తున్నారు. అతి చిన్న వయసులోనే ఆంధ్ర రాష్ట్ర ప్రతిపక్ష నేత గా ఎన్నికైన జగన్ తన వయసుకు తగ్గ వారితో భవిష్యత్ తరాలకు మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.


ఎందుకంటే యువకులు ఒక్కసారి పార్టీని నమ్ముకుంటే ఎన్ని కష్టాలు ఎదురైనా వెనుదిరిగి చూడరు. పార్టీని అట్టిపెట్టుకునే ఉంటారు. ప్రలోభాలకు లొంగరు. ఫిరాయింపులకు పాల్పడరు. ఈ విషయంలో సీనియర్లతో కాస్త ఇబ్బంది ఉంటుంది. కొంత మంది సీనియర్ నాయకులు అవసరానికి అనుగుణంగా పార్టీ మారుతుంటారు. ముఖ్యంగా 2014 ఎన్నికలలో తన పార్టీ గుర్తు తరుపున గెలిచి అధికార పార్టీ లోకి వెళ్లిన వారిలో ఎక్కువగా సీనియర్ నాయకులే ఉండటం గమనార్హం.


ఇందుమూలంగా రాబోయే ఎన్నికలలో అలాగే భవిష్యత్తు రాజకీయాలలో తన పార్టీ తరపున పోరాడేవారు నిలబడేవారు ఎక్కువగా యువరక్తం కలిగినవారే ఉండాలని జగన్ అభిప్రాయ పడుతున్నట్లు సమాచారం. మరోపక్క ఇదే క్రమంలో తన పాదయాత్రతో ప్రజలకు కూడా మరింతగా దగ్గరవుతున్నారు. ఇందుమూలంగానేమో గాని ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అన్ని సర్వేలలో స్పష్టమైన మెజారిటీ వస్తోంది జగన్ కి....2019 ఎన్నికలలో ఖచ్చితంగా జగన్ ముఖ్యమంత్రి అవ్వుతారని వాళ్ళ నాన్న మాదిరే పరిపలిస్తారాన్ని అంటున్నారు చాలామంది రాష్ట్ర ప్రజలు..ఒక్కసారి జగన్ ముఖ్యమంత్రి అవ్వుతే కొన్ని తరాలు బ్రతికేలా సంక్షేమ ఫలాలు రాష్ట్రంలో అమలు అవ్వుతాయి అన్ని అంటున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: