విజయనగరం జిల్లా జగన్ పాదయాత్ర లో ఎవరు ఊహించని దృశ్యం..!

KSK
విజయనగరం జిల్లాలో వైసీపీ అధినేత జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర అశేష జనవాహిని మధ్య అద్భుతంగా సాగుతోంది. జిల్లాలో జగన్ సభ పెట్టిన ప్రతి చోట ఇసుక వేస్తే రాలనంత జనం వస్తున్నారు. తన పాదయాత్రలో జగన్ ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల విజయనగరం జిల్లా నెల్లిమర్లలో జరిగిన మహాసభలో ఓ దృశ్యం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.


ఇంతకీ ఆ దృశ్యం ఏమిటంటే..జగన్ తలపెట్టిన పాదయాత్ర ముగుస్తున్న సమయంలో ప్రతి చోట ఓ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో నెల్లిమర్లలో జరిగిన మహాసభలో జగన్ మాట్లాడుతుండగా ఒక గర్భిణీ ఆటో లో ఉండి తీవ్ర ఇబ్బందులతో సతమతమవుతోంది.


ఇదే క్రమంలో సభా స్థలం లో జనం భారీ స్థాయిలో చేరుకున్నారు..గర్భిణీ ఉన్న ఆటో ఈ మహా సభను దాటుకుని వెళ్లాలి..దీంతో విషయం తెలుసుకున్న జగన్ వెంటనే తన ప్రసంగాన్ని ఆపి అక్కడికి వేలాదిగా తరలి వచ్చిన అభిమానులను ఆ తల్లి ఉన్న ఆటోకు దారి వదలాల్సిందిగా కోరారు.దీనితో ఆ ఆటో పూర్తిగా బయటకు వెళ్లేంత వరకు జగన్ దారి ఇవ్వాలని కోరారు. దీనితో అభిమానులు ఆ ఆటోకు దారి వదిలారు.


ఈ సంఘటన ద్వారా జగన్ తన పెద్ద మనసును చాటుకున్నారు. అదే సమయంలో జగన్ ఇది వరకు ఇలాంటి సమస్యలు ఏవి తలెత్తకుండా 108 అంబులెన్సు సర్వీసు ఉండేదని ఇప్పుడు చంద్రబాబు దుర్మార్గపు పాలనలో ఒక ఆటోలో ఇలా ఒక గర్భిణీ స్త్రీ వెళ్ళవలసిన దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. దీంతో జగన్ తన మానవతను మరొకసారి చాటుకున్నారు..ఇదే క్రమంలో ఈ దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. జగన్ స్పందించిన విధానంపై చాలా మంది నెటిజన్లు జగన్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: