హైకోర్ట్ లో ఏపి ప్రభుత్వానికి "కోర్ట్ ధిక్కరణ నేరం కేసు" లో నోటీసులు?

ఆంధ్ర ప్రదేశ్ "షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్‌ అధ్యక్షుడు" నియామకం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉభయ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు లో ధారుణమైన ఎదురుదెబ్బ తగిలింది. ఈనియామకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాని కి నేడు శుక్రవారం నోటీసులు జారీచేసింది. 



ఏపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ గా కారెం శివాజీని నియమించిన సంగతి తెలిసిందే. కమిషన్‌ చైర్మన్‌గా శివాజీ ఎన్నిక చెల్లదంటూ న్యాయవాది హరి ప్రసాద్‌ హైకోర్టును ఆశ్రయించారు. గతం లో కారెం శివాజీ ఎంపిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన పిటిషన్‌ లో ప్రస్తావించారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లఘించిన ఏపీ ప్రభుత్వం కారెం శివాజీని తిరిగి కమిషన్‌ చైర్మన్‌గా నియమించడంపై ఆయన "కంటెమ్ట్‌ ఆఫ్‌ కోర్టు" లేదా ప్రభుత్వం న్యాయస్థానాన్ని ధిక్కరించినట్లు పిటిషన్‌ దాఖలు చేశారు.



ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. అంతేకాకుండా కమిషన్‌ చైర్మన్‌ నియామక పక్రియకు సంబంధించి న రికార్డులను హైకోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. అక్టోబర్‌ 31న కారెం శివాజీ నేరుగా కోర్టుకు హాజరుకావాలని కూడా ఆదేశించింది. 

న్యాయవాది హరి ప్రసాద్‌ షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్‌ అధ్యక్షుడు కారెం శివాజీ ఎంపిక, నియామకం చెల్లదంటూ గతంలో హైకోర్టు ఆదేశించిన విషయాల ను పిటిషన్‌ లో ప్రస్తావించారు. ఏపీ ప్రభుత్వం శివాజీని తిరిగి కమిషన్‌ చైర్మన్‌ గా నియమించడం హైకోర్టు ఆదేశాలను ఉల్లఘించినట్లేనని పిటిషనర్ పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ కంటెమ్ట్‌ ఆఫ్‌ కోర్టు ప్రకారం లాయర్ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: