ఎడిటోరియల్: తెలుగుదేశం ఖేల్ ఖతం! చరిత్రలో మరో ఔరంగజేబు అవతరణ?


సాధారణంగా పదుగురు మాట్లేడే సందర్భాల్లోనే కాదు, జాతీయ మాద్యమాల్లోనే కాదు, సమాచార మాద్యమాల్లోనే కాదు, సర్వేలే కాదు, క్షేత్ర స్థాయిలో ప్రజల్లో మూలాల నుండి పలుకుబడి కోల్పోయింది నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షుడుగా ఉన్న తెలుగుదేశం పార్టీ కారణాలు అనేకం.


అపార రాజకీయ అనుభవం ఉండీ కేంద్రం తన నిఘా సంస్థలతో అంటే సీబీఐ, ఈడి ఇన్-కం టాక్స్ తదితర వ్యవస్థలతో తన మీద తన ప్రభుత్వం మీద తన పార్టీ మీద కక్షతో దాడి చేయ నుంది కాబట్టి ప్రజలంతా తమ చుట్టూ వలయంగా ఏర్పడి నిజాయతీని న్యాయాన్ని దౌర్జన్యానికి వ్యతిరేఖంగా కాపాడాలని పలు మార్లు పలు సందర్భా ల్లో జనాలను చాలా డిప్రెషన్ లో ఉన్న పరిస్థితుల్లో కోరుతూ వస్తున్నారు.


అంతే కాదు సినీ నటుడు ప్రస్తుతానికి వృత్తిపరంగా అవకాశాలు కోల్పోయి ఆ రంగంలో అవకాశాలు శూన్యంకాగా రాజకీయాల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తూ ఆపరేషన్ గరుడ ద్రవిడ అంటూ సమాజంలో అరాచకపు వాతావరణం సృష్టించటానికి నేపధ్యం టిడిపి అధినేతే ఉన్నారంటారు. గరుడైనా ద్రవిడైనా సమాజంలో అమలవటం అసాధ్యం. అంతా రాజకీయ వ్యూహాలే అవి. అవకాశముంటే ప్రతిపార్టీ అలాంటి వాతావరణాన్ని ప్రతి వ్యూహాన్ని రచించవచ్చు. కాని అమలు పరచటం ఈ ప్రజాస్వామ్య సమాజంలో అసంభవం.


ఆంధ్రప్రదేశ్ ప్రముఖ ప్రాంతీయ మాధ్యమ యజమాన్యాలు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, అమరావతి నగరం, ప్రముఖ గుత్తేదార్లు, సినీ రంగం, అనేక ప్రభుత్వ వ్యవస్థ ల అధినేతలే కాదు మూలాల్లోని ఉద్యోగ వర్గాలు అంతా ఒక కుల లేదా సామాజిక వర్గానికి చెందిన వారవటంతో ముఖ్యమంత్రి మద్దతు పూర్తిగా కలిగి ఉన్న సొంఠినేని శివాజి మాటలకు అంత ప్రచారం లభించింది. లేకుంటే వేరే ప్రభుత్వం అధికారంలో ఉండి ఉంటే ఈ మాటలు గాలి మాటలుగా తేలిపోయేవి. అసలు శివాజి దైహిక బాషే చండాలం. ఎందుకూ పనికి రాని చెత్తవాగుడు జనం పరిగణించబట్టే ఇంతగా పచ్చ మీడియా ప్రచారం చేసినా - థూ...నా బొడ్డు అంటూ జనం తన్నేశారు. ఇక్కడ ప్రభుత్వం, దానికి మద్దతిచ్చే ప్రముఖ మీడియా తన ప్రతిష్ట సమూలంగా కోల్పోయింది. ఇప్పుడు ఆ పత్రికలు చానళ్ళు - పచ్చ ప్రజలు ఏమనుకుంటున్నారు అనే సమాచార సేకరణకు మాత్రమె మిగిలిపోతున్నయని అర్ధమౌతుంది.


ఇకపోతే పోలవరం అమరావతి నిర్మాణంలో వేలకోట్ల అవినీతి జరిగింది అనేది ప్రజలు నిర్ద్వంధం గా గుర్తించారు. వేల కోట్ల సొమ్ము ఆవిరి అయిపోయిందనే వాదనలు మిన్నంటుతున్నాయి. ఒక పదిహేనుకు పైగా కేసులలో న్యాయ వ్యవస్థలను రాజకీయ కుల ప్రాంతీయ తత్వంతో నియంత్రించి విచారణలను నిలుపుదల చేయించు కున్న ఏకైక వ్యక్తి ఏపి ముఖ్యమంత్రి మాత్రమే అంటారు విశ్లేషకులు, న్యాయవాదులు.


ఇకపోతే కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు బాబుగారికి అమరావతి దొరికింది. దాని భూ సేకరణ మొదలుకొని రైతులపై దాడులవరకు అంతా అఘోచరమైన ప్రశ్నార్ధకాలతో గందరగోళమే. కారణం అందింకాడికి అమరావతిని ఒక కులాధిక్య సమాజంగా మలచటం ఒక రాజకీయ విన్యాసం అంటారు. అంతేకాదు అమరావతి పేరుతో సింగపూరులు జాతి సంపద తరలిపోయిందని ఇంకా మున్ముందు ఇంకెంతో తరలింపుల ప్రణాళికలు సిద్ధమయ్యాయని తెలుస్తుంది. ఒక ప్రపంచ ప్రఖ్యాత నగర నిర్మాణ సంస్థ మాకీ అసోసియేట్స్ వాదన కూడా చంద్రబాబు అవినీతి ప్రణాళికను వ్యక్తం చేసింది. అందుకే అమరావతి నగర నిర్మాణంలోని గూడుపుఠాణి తన పార్టీ వారికి కూడా మర్మమే రహస్యమే నని అంటారు.

లక్షల కోట్ల అప్పులు జాతికి మిగిల్చి ఈ అధినేతలు దేశ విదేశాల్లో మహా సౌధాలు నిర్మించుకుంటున్నారని కేంద్ర రాష్ట్రాల్లోని ప్రతిపక్ష పార్టీలన్నీ కోడై కూస్తున్నాయి. అంతేకాదు అమరావతిలోనూ, చంద్రబాబు స్వంత ఊరులోను, దాయాది రాష్ట్రమైన తెలంగాణా రాజధాని హైదరాబాద్ నగరం తదుతరప్రాంతాల్లోని చంద్రబాబు స్వగృహాల నిర్వహణ కూడా ఇపు రాష్ట్రాల ప్రభుత్వాలే పెను భారమై కూర్చూంది. ఈ విషయం గురించి సొంఠినేని శివాజి మాట్లాడక పూఅవటం స్వకుల జన పరిరక్షణ కాదా? ఇదంతా ప్రజల్లో ముఖ్యంగా కమ్మేతర వర్గాల్లో మొత్తం కమ్మ సమాజానికే వ్యతిరేఖతగా తయారైంది. ఎందరో మహానుభావులు అన్నీ కుల్లాలో ఉన్నట్లే బాబు కులంలోనూ ఉన్నారు. వారికి ఈయన రాజకీయ ఆర్ధిక సామాజిక సాంప్రదాయ ఆద్యాత్మిక ప్రవర్తన నదవడిక సమాజంలో అప్రతిష్ఠ తెచ్చిపెడుతున్నాయని ఎనదరో ఆ వర్గ ప్రజలు వాపోతున్నారు. ఈ విధంగా బాబు స్వకులభ్రష్ట కూడా ఆపాదించుకుంటున్నారు.


ఇక అమెరికా లాంటి విదేశాల్లోనైతే సినీ స్టార్స్ సెక్స్ స్కాండల్ తెచ్చిపెట్టిన అప్రతిష్ట అంతా ఇంతగాదు. తెలుగువాళ్ళంటే అక్కడి వ్యవస్థలు అనుమానా స్పదంగా చూస్తున్నాయి. అవసరమై తే మన బట్టలూడదీసి విచారించే స్థితికి దిగజారింది పరిస్థి. కారణం అక్కడి టిడిపి ప్రవాసులే. బాబు సామాజిక వర్గ పార్టీ సానుభూతి పరులేనట.


ఇక పోతే నిన్న మొన్నటి ఆదాయ శాఖ వివిధ వ్యాపార సంస్థలపై చేసిన దాడులకు ఉలిక్కి పడ్డ ముఖ్యమంత్రి మరియు మంత్రివర్గంలో కలకలం చెల్లరేగటం చూస్తే ఆ వ్యవస్థలు మంత్రి వర్గం కుల బందు పార్టీల్లోని వ్యక్తుల స్వంత సంస్థలేనని - ఇప్పటివరకు అవినీతి, ప్రజాధన దోపిడీకి, అన్యాలను ఆలవాలమై ప్రభుత్వ నీడలో తలదాచుకుంటూ బ్రతిబట్ట కట్తాయనే తేలుతుంది.


శాసనం ద్వారా సిద్ధించిన అధికారంతో సోదాలు చేసే జాతీయ వ్యవస్థలకు అందులోని అధికారులకు రాష్ట్ర పోలీసులు రక్షణ కల్పించరని కాబినెట్ లో చర్చినతీరు - మొత్తం రాష్ట్ర కాబినెట్ అవినీతి కూపమా? అనే అనుమానాలకు ఆజ్యంపోస్తున్నాయి. ఇది ఏదో చెప్పే మాటలు కాదు. నిస్సిగ్గుగా మంత్రిమండలి చర్చించిన విషయం. బహిరంగ రహస్యం.


కులాల కురుక్ష్రెత్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఇతర కులాలల్లో విభేదాలు సృష్టించి బ్రతికి పోతున్న ఈ పార్టీకి నూకలు చెల్లిపోవాలని మొత్తం సమాజం కోరుకున్న భావన వ్యక్తీకరిస్తున్నారు. ఓటుకు నోటు కేసు లో కావలసింత అప్రతిష్ట మూటకట్టుకున్న ఈ నాయకుడు – నేరాభియోగాలులేని సరైన నాయకుడుగాని ప్రతిపక్షంగాని ఉండుంటే ఈ ప్రభుత్వమెప్పుడో నామరూపాలు లేకుండా కొట్టుకు పోయుండేది.


ఇక దుబారా విషయానికొస్తే ప్రత్యేక విమానాల్లో పదుల అనేక మందీ మార్భలాలతో రాజధాని నిర్మాణం మొదలు కొని ఏదో మిష దొరికిందే తడవుగా విదేశీ పర్యటనలు, ఏ కార్యక్రమానికైనా ఐదారు సార్లు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు పంటి చికిత్సలకే లక్షలు ఖర్చుపెట్టే నాయకులతో రాష్ట్రం ఆర్ధిక ఊబిలో కూరుకు పోతుంది  కోటాను కోట్ల ప్రజాధనం బుగ్గిపాలై రాష్ట్రం అప్పుల కూపంలోకి జారిపోతుంది.


రాజకీయానికి వస్తే ఎన్ డి ఏ నుండి స్వార్ధ కోసం బయటబడి అదీ నాలుగేళ్ళు అన్నీ అవకాశాలు వినియోగించుకొని అంతా అనుభవించాక ఇంక భోంచేయటానికి ఏమీ లేని సమయంలో ఎన్ డి ఏ నుండి స్వార్ధ కోసం బయటబడి ధర్మ పోరాటం తొక్కా తోలు అంటూ పరిపాలన వదిలేసి గాలికి తిరిగే గాలి ప్రభుత్వంగా తెలుగుదేశం తన పరువు ఆసాంతం కోల్పోవటం - ఒక నేరాభియోగాలు న్న వ్యక్తి చేతుల్లోకి వ్యవస్థ జారిపోతుండటానికి 100% కారణం చంద్రబాబే.

 

హైందవ జాతిపై దాని నిర్మూలనపై - ఆధ్యాత్మిక వ్యవస్థలపై టిడిపి దాడి చరిత్రలో మరో దురదృష్టకాలం దాపురించిన సంకేతాలతో మరో ఔరంగజేబుగా ఆయన జన హృదయాల్లో చిరస్మరణీయుడని చెప్పొచ్చు.  ఔరంగజేబు అవతరణ తధ్యం.   

 

శాంతి భద్రతలకు దిక్కేలేదు. ప్రస్తుత శాసనసభ్యుడు మాజీ శాసనసభ్యుల హత్యలను సైతం నివారించలేని వ్యవస్థలతో కునారిల్లుతున్న రాష్ట్రంలో సామాన్యుని జీవనం ఊహించటమే కష్టం. కాల్-మనీ, ఇసుక, కల్తీ, రవాణా, గుత్తేదార్లు, ప్రాంతీయ సమాచార మాధ్యమాలు అంతా ఒక సంకీర్ణంగా ఏర్పడి బలమైన మాఫియాగా సామ్రాజ్యంగా అమరావతి కేంద్రంగా పురుడు పోసుకుంటుందా? అనే అనుమానాలు సర్వత్రా వ్యాపించటం శోచనీయం. 



కేంద్రంతో ప్రధానితో సరైన సంభంద బాంధవ్యాలు నిర్వర్తించక నేను సీనియర్ అంటూ ప్రతి మీటింగులోను ప్రతి విషయంపై స్వకుచమర్ధనం చేసుకునే వాళ్లను చూస్తే ఎవరికైనా అసహ్యం విసుగు పుడుతుంది. కొత్త రాష్ట్రానికి ఏమీ సాధించక పోగా పదేళ్ళు రాజధానిగా హైదరాబాద్ ను వినియోగించుకునే అవకాశాన్ని ఓటు కు నోటుకు బలి చేసుకున్న ఆయన సుధీర్ఘ అనుభవం కాల్చనా? ఇంతవరకు చరిత్రలో టిడిపితో పొత్తు గాని స్నేహం గాని చేసిన ఎవరైనా కొంతలో కొంతైనా టిడిపిని నమ్మగలరా? ఒక సారి స్నేహం చేసిన వారు విడిపోవటం తప్ప కనీస మైత్రి కొనసాగింపు జరిగిందా? అనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఎవరూ పొత్తుకు దొరకకపోయే సరికి టిడిపి ఆజన్మ శత్రువు కాంగ్రెస్తోనే పొత్తుకు సిద్దమైతే టిడిపి ప్రాధమిక విధానమే డ్రైనేజ్ లో కలిసిపోతుంది. ఈ అక్రమ పొత్తుతో రాష్ట్ర విభజన నిర్దాక్షిణ్యంగా చేసిన కాంగ్రెస్ కు ఏమైనా మంచి జరగొచ్చేమో గాని టిడిపి నామరూపాల్లేకుండా పోవటం తధ్యం.  


మోడీతో బిజెపితో జనసేన పవన్ తో ఆయన పొత్తుగాని స్నేహం కాని ప్రజలు ప్రేరేపించింది గాదు. కాబట్టి వారితో తన పొత్తు స్నేహం వైఫల్యం ప్రజలకు సంభందించింది కాదు. రాష్ట్ర ప్రయోజనాల సాధన సూధీర్ఘ అనుభవమున్న బాబు బాధ్యత. అదే జరగనప్పుడు టిడిపి బాబు రెండింటి వలన ప్రజలకు మిగిలింది శుష్క ప్రియాలు...శూన్య హస్తాలే. దట్స్ ఇట్!     


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: