2014 ఎన్నికల్లో కేసిఆర్ సీక్రెట్ విషయాలను బయట పెట్టిన చంద్రబాబు..!

KSK
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ తరఫున జరుగుతున్న మహాసభలలో నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ తెలంగాణ రాజకీయాన్ని వేడెక్కి ఇస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు తాజాగా కెసిఆర్ పై సంచలన కామెంట్ చేశారు. ముఖ్యంగా 2014 ఎన్నికలలో కేసీఆర్ వ్యవహరించిన తీరును ఆయన చేసిన రాజకీయాన్ని బయటపెట్టారు. ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో ఇద్దరం కలిసి పోటీ చేద్దామని కెసిఆర్ కి తన నిర్ణయాన్ని తెలిపానని చంద్రబాబు తెలిపారు.


ఈ క్రమంలో కెసిఆర్ ఆ సమయంలో వారం రోజులు టైం కావాలని చెప్పి చివరాకరికి కలవనని తేల్చి చెప్పినట్లు చంద్రబాబు తెలిపారు. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ముందస్తు ఎన్నికల విషయంలో తెలుగుదేశం పార్టీని ఒంటరిగా పోటీ చేయాలని కెసిఆర్ సూచించారని చంద్రబాబు సంచలన కామెంట్ చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోకూడదని కెసిఆర్ తనకు చెప్పినట్లు స్పష్టం చేశారు. కేసీఆర్ ఇచ్చిన సూచనలతో ఆలోచిస్తే అప్పటికే కేసీఆర్ వేరేవాళ్ల చేతుల్లోకి వెళ్లాడని అర్ధమైందన్నారు.


2014 ఎన్నికల ముందే ఏపీలో జగన్, తెలంగాణలో టీఆర్ఎస్ వస్తుందని కేసీఆర్ చెప్పారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఏపీలో జగన్ వస్తే దక్షిణాది రాష్ట్రాల్లో తానే సమర్ధుడిగా చలామణి కావొచ్చని కేసీఆర్‌ ఆశించారన్నారు. కానీ ఏపీ ప్రజలు కేసీఆర్ ఆశలను తారుమారు చేశారన్నారు. ముందు నుంచి తెలుగు రాష్ట్రాల అభివృద్ధి దృష్ట్యా కేసీఆర్ తో కలిసి పని చేయాలని అనుకున్న..ఆయన ఒప్పుకోలేదని ఈ సందర్భంగా తెలిపారు చంద్రబాబు.


దీంతో చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడ్డారు టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు...కలిసి పని చేయాలనుకున్నవారు ప్రభుత్వాన్ని కూల్చే విధంగా ఓటుకు నోటు వ్యవహారాన్ని ఎందుకు నడిపించారని ప్రశ్నించారు..అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన క్రమంలో ఎందుకు మొండిగా వ్యవహరించారని చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల అధికార పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: