ఇద్దరు మొగుళ్లతో సాగే సంసారం లాంటిదే బ్యాంకింగ్ పరిస్థితి

ధారుణమైన ఎన్ పి ఏ (మొండి బకాయిలు) లతో భారత బ్యాంకింగ్‌ రంగం తనపై ఇద్దరి ఆధిపత్యాల మద్య సాండ్ విచ్ అవుతూ ఏదీ తేల్చుకోని నిర్ణయ రాహిత్య సమస్య ను ఎదుర్కొంటున్నదని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ వైవీ రెడ్డి దేశీయ బ్యాంకింగ్ రంగాన్ని అటు కేంద్రప్రభుత్వం, ఇటు రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చెరోవైపు నియంత్రి స్తుండటమే సమస్యకు మూలకారణమౌతుందని అన్నారు.

ఆర్బిఐకి సర్వాధికారాలు ఉన్నాయని కేంద్రప్రభుత్వం అంటున్నా, ఆర్‌బీఐ మాత్రం తనకు తగినంత బాంకింగును నియంత్రించే అధికారాలే లేవని ఆందోళన వ్యక్తం చేస్తున్నది. కేంద్రప్రభుత్వం, ఆర్బిఐ అంగీకరించినా, అంగీకరించకపోయినా, బ్యాంకింగ్ వ్యవస్థ నానా అవస్థలు పడటానికి ద్వంద్వ నియంత్రణే కారణం అన్నమాట మాత్రం వాస్తవమని వైవి రెడ్డి కుండ బద్ధలు కొట్టారు.

ఆర్బీఐపై ఈ విధమైన జంట పెత్తనానికి శుభం కార్డ్ వేయాలని 20ఏళ్ల క్రితమే నరసింహన్ కమిటీ సూచించినా ఇప్పటి వరకు దుస్థితిని తొలగించటం జరగలేదని ఆయన అన్నారు. "ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ - ఐఎస్బీ" లో గత శనివారం జరిగిన వార్షిక ఆర్థిక సమావేశం- "అర్ధ 2018" లో ఆర్బీఐ మాజీ గవర్నర్‌ వైవీ రెడ్డి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అధికారపరిధిలోకి ప్రవేశించేందుకు బ్యాంకులను ఒక ఆయుధంగా మలచుకుంటున్నాయన్నారు. రాజకీయ ఆర్థిక వ్యవస్థ మరో సమస్యగా మారింద న్నారు. ప్రస్తుతం చాలా మంది ప్రజా ప్రతినిధులు అంటే పార్లమెంట్ సభ్యులు వ్యాపారవేత్తలుగా ఉన్నారని చెప్పారు. 
 
భారత జిడిపిలో వ్యవసాయ రంగం బాగస్వామ్యం భవిష్యత్తులో ఇది మరింతగా తగ్గే అవకాశం ఉందని ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవి రెడ్డి అన్నారు. తాను ఆర్బిఐ గవర్నరు గా  ఉన్నప్పుడే కేంద్రప్రభుత్వం ఋణ మాఫీని ప్రకటించిందని, ఇందులో అయిష్టంగా తాను కూడా భాగస్వామినయ్యానని చెప్పారు. రాష్ట్రాల వ్యవసాయ ఋణ మాఫీ కన్నా కేంద్ర ఋణ మాఫీ ప్రమాదకరమని అభిప్రాయ పడ్డారు. 

దేశవ్యాప్తంగా రైతులంతా నష్టాలపాలయ్యే అవకాశం ఉండదన్నారు. ప్రస్తుతం బ్యాంకులనుంచి పదిశాతం మంది రైతులే మాత్రమే ఋణాలు పొందుతున్నారన్నారు. రాజకీయాల ప్రమేయంతో రూపొందించే అస్తవ్యస్త వ్యవసాయ విధానాల వల్ల వ్యవసాయరంగంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొంటున్నాయన్నారు. నీటిలభ్యత, విత్తనాల నాణ్యత, ఎరువుల నాణ్యతలేక పంట దిగుబడి తగ్గి కనీస మద్దతు ధర లేకుండా ఒక ప్రక్క - వ్యవసాయోత్పత్తుల ఎగుమతి విధానం ఏ ఏడాదికా యేడాది అనిశ్చితితో తల్లడిల్లి రైతులకు అత్యంత అన్యాయం చేస్తున్న వాతావరణం నెలకొంటోందని పేర్కొన్నారు.

ఉత్తరాది రాష్ట్రాల్లో నిశ్శబ్ద విప్లవం సాగుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయని, మండల్ కమిషన్ సూచనలు దీనికి  దోహదపడుతోందని ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవి రెడ్డి చెప్పారు. భవిష్యత్లో ఉత్తర ప్రదేశ్, బీహార్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు కూడా భారీ వృద్ధిని సాధించే అవకాశం ఉందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: