షాకింగ్: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులకు, పార్టీలకు జాయింటుగా ఝలక్: ఈసి

దేశంలోని అన్నీ రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థులకు "జాతీయ ఎన్నికల సంఘం" ఝలక్ ఇచ్చింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నేర చరిత్ర ఉంటే,  ఆ వివరాలను వారే ప్రమాణ పత్రంలో సవివరంగా విధిగా పొందు పరచాలని ఆదేశించింది. బహుశ ఈ నిబంధన సరిగా అమలైతే ఆ విషయంలో సుప్రీం ఆదేశాలను తు., చ., తప్పకుండా భారత జాతీయ ఎన్నికల సంఘం పర్యవేక్షణ చేస్తే పార్టీలకు ఎన్నికల్లో డబ్బు వెద జల్లి గెలిచే అభ్యర్ధులు దొరకటం దుర్లభమే. 

అంతేకాదు, అభ్యర్థుల నేర చరిత్ర గురించి పత్రికలు, టీవీల్లో ప్రకటన రూపంలో తెలియజేయాలని రాజకీయ పార్టీలకు సూచించింది. 

తాజాగా సవరించిన నిబంధనల ప్రకారం, ఈ ఏడాది ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తప్పకుండా ఈ నిబంధన పాటించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ నిబంధన తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు కూడా వర్తిస్తుంది. నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన తర్వాతి రోజు నుంచి, పోలింగ్‌ తేదీకి రెండు రోజుల ముందే ప్రకటనలు చేయాలని పేర్కొంది. దీంతో అభ్యర్థుల నేర చరిత్రను పట్టించు కోకుండా టికెట్లు ఇస్తున్న రాజకీయ పార్టీలను ఈ ఎన్నికల సంఘం నూతన నిబంధన సంక్లిష్టమైన ఇబ్బందుల్లోకి నెట్టేసింది. 

ఈసీ కొత్త ఎన్నికల నిబంధన నేఱ చరిత్ర ఉన్న అభ్యర్థులకు వణుకే! పార్టీలకూ ఇబ్బందే

సుప్రీంకోర్టు తీర్పుమేరకు నామినేషన్ల సమయంలో అభ్యర్థులు దాఖలుచేసే " ప్రమాణ పత్రం ఫార్మాట్ - ఫామ్-26"లో ఎన్నికల సంఘం మార్పులుచేసింది. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ అన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులకు, రాజకీయ పార్టీల అధ్యక్షులు, కన్వీనర్లకు ఈసీ లేఖ రాసింది. దీని ప్రకారం, ఇకపై పార్లమెంట్, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమపై ఉన్న క్రిమినల్ కేసులు, పెండింగ్ కేసులు, విచారణలో ఉన్న కేసులు, శిక్ష అనుభవించిన కేసులతో సహా ప్రతి విషయాన్ని బహిర్గతం చేయాలి. మరి, ఈ నిబంధనలను మన రాజకీయ పార్టీలు పక్కాగా పాటిస్తాయో లేదా, తప్పుడు మార్గాలతో ఈసీని మభ్యపెడతాయో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: