తెలంగాణ ఎన్నికల విషయంలో మనసులో మాట బయటకు చెప్పిన పవన్..!

KSK
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ తరఫున తన కార్యక్రమాలను చాకచక్యంగా వ్యవహరించి పోతు 2019 ఎన్నికల కోసం ఏపీలో ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చిన పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల విషయంలో మాత్రం సరైన నిర్ణయం తీసుకోలేక పోతున్నారు.


ఇప్పటికే ఏపీలో ప్రజా పోరాట యాత్ర అంటూ ఉత్తరాంధ్ర మరియు రెండు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్..తాజాగా ఇటీవల విజయవాడ ప్రాంతంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించారు.ఈ క్రమంలో ఏపీలో ప్రతి జనసేన నాయకుడు రాష్ట్ర కార్యాలయానికి అందుబాటులో ఉండాలని కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు.


ఇదిలావుండగా గతంలో తెలంగాణ రాష్ట్రం లో పర్యటించిన క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలలో పోటీ చేస్తానని తెలిపిన పవన్ కళ్యాణ్ తాజాగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలపై సంచలన కామెంట్ చేశారు.అనుకున్న సమయం కన్నా ఈ సారి కాస్త త్వరగానే ఎన్నికలు రావడం ఎవ్వరు ఊహించలేదని,నిజానికి తాను 2019 ఎన్నికల్లో పోటీ చేద్దామనుకున్నానని తెలిపారు.


అంతే కాకుండా ఇది వరకే 2009 ఎన్నికల సమయంలోనే తాను తెలంగాణా రాష్ట్రం అంతటా పర్యటించానని,అప్పుడు తనతో పని చేసినటువంటి కొంత మంది కార్యకర్తలు ఇప్పుడు తెరాస పార్టీలో ముఖ్య పాత్ర వహిస్తున్నారని,దాదాపు 25 మంది తాను సరే అంటే వారు జనసేన పార్టీ నుంచి పోటీ చెయ్యడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు అని అన్నారు. ఏదైనా కచ్చితమైన విషయం రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే అని అంటున్నారు జనసేన పార్టీ నాయకులు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: