కేసీఆర్ ముఖ్యమంత్రి అవడం కోసంఏపీ యువకుడు పాదయాత్ర..!

KSK
త్వరలో తెలంగాణ రాష్ట్రం లో ఎన్నికలు జరగనున్న క్రమంలో ఆ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు ప్రచారపర్వంలో దూసుకెళ్ళిపోతున్నయి. ఈ క్రమంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనకు వ్యతిరేకంగా కూటమిగా ఏర్పడిన్న మహాకూటమి పై తీవ్ర విమర్శలు చేసి  తెలంగాణ రాజకీయాలను వేడేక్కించారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన ఒక యువకుడు రానున్న తెలంగాణ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ గెలవాలని విజయవాడ ప్రాంతం నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేశాడు.


ఈ విషయం తెలంగాణ మంత్రి మరియు టిఆర్ఎస్ నాయకుడు అయిన కేటీఆర్ కి తెలియడంతో వెంటనే సదరు యువకుడిని ఆలింగనం చేసుకుని కుశల ప్రశ్నలు అడిగి అభినందించారు. ఇంతకీ పాదయాత్ర చేసిన యువకుడిది విజయవాడ ప్రాంతం..అతని పేరు  రోహిత్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా సదరు యువకుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అలాగే మంత్రి కేటీఆర్ ని పొగడ్తల వర్షం తో ముంచెత్తారు.


ముఖ్యంగా కేటీఆర్ ప్రస్తుతం ఉన్న యువ తరానికి ఆదర్శం అని అన్నాడు ఆ యువకుడు. ఇదే క్రమంలో టిఆర్ఎస్ పార్టీ తరఫున రానున్న ఎన్నికల్లో ప్రచారం చేసే అవకాశం కల్పించాలని కేటీఆర్ ని విజ్ఞప్తి చేశారు. అయితే కుర్రాడి కోరికమేరకు కేటీఆర్ సానుకూలంగా స్పందించారు.


అంతేకాకుండా కేటీఆర్ పై ఉన్న ప్రత్యేకమైన అభిమానాన్ని చాటుకోవడానికి సదరు యువకుడు..కేటీఆర్ ముఖచిత్రాన్ని ముఖచిత్రాన్ని తన గుండెల మీద టాటూగా వేయించుకున్నానని తెలిపారు. తనది పక్క రాష్ట్రం కాబట్టి ఇక్కడ తెలంగాణాలో జరుగుతున్న అభివృద్ధిని, తేడాను గమనించగలిగానని….ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణాలో అభివృద్ధి బాగుంది, ముఖ్యంగా రైతుల కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు అద్భుతం అని రోహిత్...వచ్చే ఎన్నికల్లో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: