వారసత్వం నీకు లేదా అంటూ పవన్ పై సెటైర్లు వేసిన జలీల్ ఖాన్..!

KSK
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం ధవళేశ్వరం బ్యారేజీ పై తన పార్టీ తరపున చేసిన కవాతు ఏపీ రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ అయింది. ఈ క్రమంలో చాలామంది ఇతర పార్టీకి చెందిన వారు కవాతు కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పట్ల వ్యవహరించిన తీరు పట్ల మండిపడుతున్నారు.


ఇష్టమొచ్చినట్లు తాగినట్లు పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో వ్యవహరించారని ఏపీ రాష్ట్ర రాజకీయ నేతలు విమర్శలు చేస్తున్నారు. మరోపక్క జనసేన కార్యకర్తలు ఊహించని విధంగా ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో తమ పార్టీ రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.


ఈ క్రమంలో కవాతు కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై అలాగే మంత్రి నారా లోకేష్ పై పవన్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఖండించారు..అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు. సినిమాల్లో అవకాశాలు లేక పవన్ కళ్యాణ్ జనంలోకి వచ్చారని విమర్శించారు. పవన్ మాటలు చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.


వారసత్వరాజకీయాలపై మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ సినిమాల్లో వారసత్వం లేదా? అని ప్రశ్నించారు. సినిమాల్లో వారసత్వం ఉన్నప్పుడు,రాజకీయాల్లో ఎందుకు ఉండకూడదు? అని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో జనసేనకు ఒక్క సీటు కూడా రాదని జలీల్‌ఖాన్ జోస్యం చెప్పారు. కచ్చితంగా 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: