ఎన్డీటీవీపై ₹10000 కోట్లకు అడాగ్ - అనిల్ అంబాని - పరువు నష్టం దావా దాఖలు

రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం విషయంలో తమపై తప్పుడు కథనాలు ప్రచురించారని ఆరోపిస్తూ 'అనిల్‌ ధీరూభాయ్  అంబానీ' కి చెందిన రిలయన్స్‌ గ్రూప్ కంపెనీలు - అడాగ్ - కోర్టుకెక్కాయి. దీనితో రాఫెల్ ఎపిసోడ్ లో మరో ఆసక్తికర మలుపు చోటు చేసుకున్నట్లే.  


*15 జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మీడియా హౌజ్‌లు, జర్నలిస్టులపై పరువు నష్టం దావాలు దాఖలు చేశాయి.
*ఒక్కో కేసులో ₹ 5000 కోట్ల నుంచి ₹ 10000 కోట్ల వరకు పరువు నష్టం చెల్లించాలంటూ అడాగ్ కంపెనీలు అహ్మదాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టులో కేసులు దాఖలు చేశాయి.
*రాఫెల్‌ డీల్‌ పై వరుస కథనాలు ప్రసారం చేస్తున్న ఎన్డీటీవీ చానల్‌ పై ఏకంగా ₹ 10000 కోట్లకు కేసు వేశాయి. ఈ విషయాన్ని ఎన్డీటీవీ నిన్న శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
*ఇప్పటికే కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి 'అభిషేక్‌ మను సింఘ్వి' పై అనిల్‌ అంబానీ గ్రూప్ కంపెనీలు ₹ 5000 కోట్లకు పరువు నష్టం దావా వేశాయి. 
*ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ అధినేతల స్వంత పత్రిక నేషనల్‌ హెరాల్డ్‌, ఆ పార్టీ నేతల పైనా కోర్టుకెక్కాయి.

తాజాగా, జాతీయ, అంతర్జాతీయ మీడియాహౌజ్‌ లపై దావాలు వేశాయి. ప్రచురించిన కథనాలు తమ పరువు తీసేలా, కంపెనీలకు అపకీర్తి తెచ్చిపెట్టేలా ఉన్నాయని అని తెలిపాయి. ప్రస్తుత ప్రభుత్వం నుంచి తాము అనుచిత లబ్ధి పొందామని సాధారణ ప్రజలు భ్రమించేలా ఆ కథనాలు ఉన్నాయని ఆరోపించాయి.
 
అయితే, ఎన్డీటీవీ  చానల్‌ లో రాఫెల్‌ డీల్‌ లో ఇన్వాల్వ్ అయినట్లు చెప్పబడుతున్న రిలయన్స్‌ డిఫెన్స్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, రిలయన్స్‌ ఏరోస్ట్రక్చర్‌ కంపనీల అధికారులనుగాని, ప్రతినిధులనుగాని చర్చకు రావాలని, మీ వివరణ తెలపాలని తాము ఎన్నోసార్లు ఉన్నతాధికారులను కోరామని, కానీ, వాళ్లు స్పందించలేదని ఎన్డీటీవీ తప్పుబట్టింది. 

వాస్తవాలను ఉక్కుపాదం తో తొక్కి  పట్టడమే కాకుండా తన పని తాను చేయకుండా మీడియాను బెదిరించడానికి, నిరోధించడానికి అనిల్‌ ధీరూభాయి అంబానీ గ్రూప్ (అడాగ్) కంపెనీలు  ప్రయత్నిస్తున్నాయని ఎన్డీటీవీ ఆరోపించింది.
 
యాదృచ్చికంగా “విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం-ఫెమా” కింద ఎన్డీటీవీకి ఈడీ తాజాగా మరోసారి నోటీసులు జారీచేసింది. ₹3000 కోట్ల మేరకు విదేశీ మారక ద్రవ్య చట్టా ల ఉల్లంఘనకు పాల్పడ్డారని వాటిలో పేర్కొంది. అయితే, ఈ ఆరోపణలను ఎన్డీటీవీ ఖండించింది. నిష్పాక్షికంగా వార్తా కథనాలను అందిస్తున్నామని, అందుకే తమను టార్గెట్‌ చేశారని పేర్కొంది. మా దారికి రాకపోతే మీకూ ఇదే గతి తప్పదు అనే హెచ్చరికను ఈ నోటీసుల ద్వారా కేంద్రప్రభుత్వం ఇతర మీడియా సంస్థలకు కూడా పంపి స్తోందని తెలిపింది.

ఎన్డీటీవీపై ఈనెల 11 న దావా దాఖలు చేయగా, అది ఈనెల 26 న విచారణకు రానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: