ఉద్రిక్తతల నడుమ వివాదాల ఊబిలోకి జారిపోతున్న సనాతన దేవాలయం శబరిమల

ఒక స్త్రీ మరియు న్యాయమూర్తి ఐన ఇందూ మల్-హోత్రా మాత్రమె ఈ తీర్పుకు మద్దతు నివ్వలేదు. "మత విశ్వాసాలు వేరు - ప్రాధమిక హక్కులు వేరు - సమానత్వం లాంటి వాటిని చూపుతూ -కోర్టు లకు ఇలాంటి విషయాల్లో తీర్పులు ఇచ్చే హక్కు లేదు - అది సామాజిక దురాచారాలైన సతిసహ గమనం వంటివైతే తప్ప" ...ఇందూ మల్-హోత్రా.  

ఒకే ఒక్క దేవాలయ సాంప్రదాయాన్ని సమస్యగా చేసి దానికి సంబంధించి భారత దేశ చరిత్రలో ఇంతపెద్ద ఎత్తున నిరసన వెల్లువెత్తడం ఇదే తొలిసారి కావచ్చు. నిషేధపు ఉత్తర్వులు జారీచేయాలని, మహిళా హక్కుల కార్యకర్తలు, మానవ హక్కుల కార్యకర్తల చర్యలపై కూడా నిఘా పెంచాలని, వామపక్ష పార్టీలు, కూటములు, వామపక్ష సాను కూల అతివాద గ్రూపులు, మహిళలకు మద్దతుగా దేవాలయంలోకి ప్రవేశిస్తామని ప్రకటించిన వ్యక్తులు సంఘాలపై కార్యాచరణ ప్రారంభించాలని ఆదేశించింది.

రాజ్యాంగంలోని సమాన హక్కుల ప్రాతిపదికన మహిళలకు సైతం సమాన హక్కులున్నాయని, అయ్యప్ప దేవాలయంలోకి నిర్దిష్టమైన వయసు గ్రూపుల వారిని అనుమతించక పోవడం హక్కులను హరించడమేనని రాజ్యాంగ ధర్మాసనం గతనెలలో తీర్పుచెప్పిన సంగతి తెలిసిందే. కేరళ శివసేన అయితే ఆలయంలోకి నిషేధిత గ్రూపు మహిళలు ప్రవేశిస్తే తమ ఆత్మాహుతి దళాలు అక్కడే ఉంటాయని, సామూహిక దాడులు తప్పవని హెచ్చరించింది. మళయాళ నటుడు కొల్లం తులసి సైతం ఇదే ఉద్రేక పూరిత వ్యాఖ్యలు చేయడం కూడా అయ్యప్ప భక్తుల్లో ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు దారితీసింది. 


వందలాది ఏళ్లుగా వచ్చిన సనాతన ఆచార వ్యవహారాలను కొనసాగించాల్సిందేనని అంటూ ఆలయ పాలక వర్గం, వంశ పారం పర్య రాజ కుటుంబీకులు సైతం స్పష్టం చేసారు. దీనితో ఒక పక్క రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసినా విచారణకు బెంచ్‌ పైకి వచ్చేసరికే సుప్రీం తీర్పును అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం అయ్యప్ప భక్తుల సెంటిమెంట్‌ ను దెబ్బ తీసిందనే చెప్పాలి. ఏది ఏమైనా అత్యంత సున్నితమైన ఈ సమస్యకు తిరిగి సుప్రీం కోర్ట్ మాత్రమే ప్రజలను సమాధాన పరచాల్సి ఉంది.

దేశ వ్యాప్తంగా అయ్యప్ప భక్తులు వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. దేశ రాజధాని ఢిల్లీ, దక్షిణాదిలోని కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో సైతం నిరసన ప్రదర్శనలు మిన్నంటాయి. కోర్ట్ తీర్పు వ్యతిరేఖ ఆందోళనకారుల్లో మహిళలు సైతం ఉండటం గమనార్హం. పంపానది నుంచి శబరిమలైకు వెళ్లే దారిలో ప్రత్యేకించి యుక్తవయసు మహిళలను అడ్డగించింది కూడా మహిళలే కావడం గమనార్హం.  అనాదిగా వస్తున్న ఆచార సాంప్రదాయాలపై అయ్యప్ప భక్తుల మనోభావాలను దెబ్బ తీసినట్లుగా వారు భావిస్తున్నారు.


వందల ఏళ్లుగా వస్తున్న ఆచార వ్యవహారాల్లో రాజ్యాంగ హక్కుల పరిరక్షణ పేరిట సుప్రీం కోర్ట్ జోక్యం చేసుకోవటం పై వారు మండి పడుతున్నారు. రాజ్యాంగ ధర్మాసనం లో మహిళా న్యాయమూర్తి సైతం హిందూ మత సాంప్రదాయాల్లో న్యాయవ్యవస్థ జోక్యం అనవసరమన్న అభిప్రాయం వ్యక్తం చేయడంతో ఈ ఆందోళనకు మరింత  బలాన్నిచ్చింది. మొత్తం మీద రివ్యూ పిటిషన్‌ విచారణకు వచ్చి సుప్రీం తీసుకునే కీలకనిర్ణయమే ఇపుడు అయ్యప్ప భక్తులకు శిరోధార్యం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 



సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్‌ వేసేది లేదని కేరళలోని వామపక్ష ప్రభుత్వం స్పష్టం చేయడం అయ్యప్ప భక్తులకు మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. దీనితో జాతీయ అయ్యప్ప భక్తుల సంఘం తరపున సుప్రీంలో రివ్యూ పిటిషన్‌ దాఖలైంది. అయినప్పటికీ తీర్పు అమలు అనివార్యం కావడంతో ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయడాన్ని అయ్యప్ప భక్తుల్లో తీవ్ర నిరసన, ఆగ్రహానికి కారణమైంది. 


సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్‌ వేసి సనాతనాచారాన్ని అధిక సంఖ్యాకుల మత విశ్వాసాల ను కాపాడవలసిన కేరళ లోని వామపక్ష ప్రభుత్వం ఆ పని చేయనని స్పష్టం చేయడం అయ్యప్ప భక్తులకు మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. దీనితో ప్రభుత్వం చేయనన్న పనిని "జాతీయ అయ్యప్ప భక్తుల సంఘం" తరపున సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలైంది. అయినప్పటికీ తీర్పు అమలు అనివార్యం కావడంతో ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయడాన్ని అయ్యప్ప భక్తుల్లో తీవ్ర నిరసన, ఆగ్రహానికి, అలజడికి కారణమైంది.

ఎక్కడికక్కడ భక్తులను నిలిపివేస్తున్నారు. 10-50 ఏళ్లమధ్య వయస్కులైన మహిళలను నిశితంగా పరిశీలించి మరీ వాహనాల్లోనుంచి దించివేస్తున్నారు. అయితే ఇందుకు సోషల్‌ మీడియా ప్రచారం కూడా ఉద్రిక్తతలకు తావిస్తోందని కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తంచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రతికూల సందేశాలపై గట్టినిఘా ఉంచి అవసరమైతే ఇంటర్నెట్‌ సేవలను నిలిపి వేయాలని కూడా సూచించింది.

సంస్కృతి సంప్రదాయాల్లో ఎవరూ జోక్యం చేసుకోకూడదని శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తానని చెబుతూనే, సంప్రదాయాలను అనుసరించాల్సిన అవసరాన్ని కూడ ఆయన నొక్కి చెప్పారు.ప్రతి ఆలయానికి ఒక చరిత్ర, సంప్రదాయం ఉంటుందని అన్నారు.....రజనీకాంత్


దేశవ్యాప్తంగా సాగుతున్న విషప్రచారానికి సైతం తెరదించాల్సిన గురుతర బాధ్యత పాలకులపై కూడా ఉంది. హిందూ మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా ప్రస్తుత నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదన్న భావన పై ఇపుడు సుప్రీం పునఃసమీక్ష కేంద్ర బిందువుగా మారనుంది. ఈ లోపు మత విశ్వాసాలను సాకుగా తీసుకుని అల్లర్లకు రెచ్చిపోయే రాజకీయ శక్తులను నిలువరించాల్సిన బాధ్యత అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల పైనే ఉంది. ఇపుడు ఈ రెండూ కూడా వేచిచూసే ధోరణిని వీడక పోతే భవిష్యత్తులో మరింత ఉపద్రవం ముంచుకు వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: