సంచలనం: శబరిమలపై సుప్రీం తీర్పు తర్వాత వేసిన పిటిషన్లపై సత్వర విచారణ

శబరిమల తీర్పు తదనంతరం ధాఖలైన పిటిషన్లను విచారణకు సుప్రీంకోర్టు సుముఖత తెలిపింది. 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న మహిళలు అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించ కుండా ఉన్న నిషేధాన్ని ఎత్తి వేస్తూ గతంలో ఐదుగురు జడ్జీల సుప్రీం ధర్మాసనం  ఇచ్చిన తీర్పు దేశంలో అయ్యప్ప భక్తుల విశ్వాసాన్ని గాయపరచింది. సుప్రీం వెలువరించిన తీరును అత్యధిక సంఖ్యలోని హిందూ మహిళలే తెరస్కరించారు.

అయితే సుప్రీం ధర్మాసనం తీర్పు వెలువరించినప్పటి నుండి శబరిమలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  అంతేకాదు దేశ వ్యాప్తంగా కేరళ ప్రభుత్వ తీరుపై దేశ అత్యధిక సంఖ్యాకులు మహిళలతో సహా వ్యతిరెఖత వ్యక్త పరిచారు. 

ఈ నేపథ్యంలో ఒక న్యాయవాది, శబరిమలలోని అయ్యప్ప దేవాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయని, ఈ అంశంపై సత్వరమే విచారణ చేపట్టాలని పిటిషన్ వేశారు. తాజాగా ఈ పిటిషన్ పై సుప్రీం ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. ఈ పిటిషన్లపై ఎప్పుడు విచారిస్తామనే అంశాన్ని రేపు మంగళవారం నిర్ణయిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, ఎస్కే కౌర్‌ లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ అంశంపై 19పిటిషన్లు పెండింగ్‌ లో ఉన్నాయని, ఈ వ్యాజ్యాలపై ఎప్పుడు విచారణ జరపాలనే అంశాన్ని రేపు నిర్ణయిస్తామని  జస్టిస్‌ గొగోయ్‌ తెలిపారు.

బహుశ ఈ విచారణైనా సనాతన, సాంస్కృతిక, సాంప్రదాయ, ఆచార వ్యవహారాలను - వ్యవస్థకు కీడు కలిగించనంతవరకు వాటిని కొనసాగించే దిశగా ముందుకు కదలాలని శబరిమల అయ్యప్ప భక్త సమాజంతో పాటు హిందూ జాతి కోరుకుంటుంది.    


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: