40 మంది అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు పై బాంబు పేల్చిన ఎంపీ జెసి..!

KSK
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న విషయం మనకందరికీ తెలిసినదే. ముఖ్యంగా తిత్లి తుఫాను బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు బృందానికి ప్రజల నుండి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు..మా దగ్గరకు రావద్దు అంటూ చాలామంది తుఫాను బాధిత ప్రజలు చంద్రబాబు ప్రభుత్వం పై మండి పడుతున్నారు.


ఈ నేపథ్యంలో అంతపురం జిల్లా పార్లమెంటు సభ్యుడు అయిన జేసీ దివాకర్ రెడ్డి చంద్రబాబు పై సంచలన కామెంట్ చేశారు. ఎన్నికల ముందు జెసి చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. తాజాగా ఇటీవల ఏపీ నూతన రాజధాని అమరావతి లో పర్యటించిన జేసీ దివాకర్ రెడ్డి..మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పై ప్రజల్లో సానుకూలత ఉందన్న జేసీ ఎమ్మెల్యేలపై మాత్రం వ్యతిరేకత ఉందన్నారు.


40 % మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందన్నారు. ఆ ఎమ్మెల్యేలను మారిస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి కాకుండా ఎవ్వరూ అడ్డుకోలేరని చెప్పారు. వైసీపీ అధినేత జగన్ - జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలుస్తారని తాను అనుకోవడం లేదని జేసీ వివరించారు.


వారిద్దరూ ఆలోచనలు వేరు వేరుగా ఉంటాయని పేర్కొన్నారు. అంతేకాకుండా వారిద్దరూ వారి సీట్లు మాత్రమే గెలుస్తారు తప్ప ఇతర సీట్లు గెలిపించుకోలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు . మొత్తంమీద ఎన్నికల ముందు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చంద్రబాబు పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఎంపీ జేసీ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: