కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి...గవర్నర్ కి తెలియజేసిన పవన్..!

KSK
ఇటీవల శ్రీకాకుళం జిల్లా తిత్లి తుఫాను నేపథ్యంలో బాధిత ప్రాంతాల్లో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా తన పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా తుఫాను బాధిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దృష్టికి తీసుకు వచ్చారు పవన్ కళ్యాణ్. గవర్నర్ నరసింహన్ను కలిసిన నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం లో జరిగిన ప్రకృతి ఘటన గురించి గవర్నర్ దృష్టికి తీసుకు వచ్చాను అని తెలియజేశారు..ఇంకా పవన్ మాట్లాడుతూ తిత్లీ తుఫాన్ ధాటికి శ్రీకాకుళం జిల్లా సర్వనాశనం అయ్యిందని ఆ విషయాన్ని వీడియోలతో సహా ఏవీ ప్రజంటేషన్ ఇచ్చినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.


తిత్లీ తుఫాన్ ధాటికి ఉద్యానవనం లాంటి ఉద్దానం దారుణంగా నష్టపోయిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. తుఫాన్ కు ముందు ఉద్దానం ఎలా ఉంది తిత్లీ తర్వాత ఉద్దానం ఎలా ఉందో అన్న విషయాన్ని వీడియోల ద్వారా వివరించినట్లు తెలిపారు.


శ్రీకాకుళం జిల్లాలో ఆరు రోజులు పర్యటించి..48 గ్రామాల ప్రజలతో కలుసుకుని వారి బాధలను తెలుసుకున్నానని... రోజుకు దాదాపు 30 కిలోమీటర్లు నడిచారని తెలియజేశారు పవన్.


ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో ఉన్న గిరిజన ప్రాంతాల్లో ఎప్పటికీ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టడం లేదని తెలియజేశారు. వెంటనే ఈ విషయంలో గవర్నర్ నరసింహన్ శ్రీకాకుళంలో జరిగిన ప్రకృతి వైపరీత్యాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని అందుకు కలిశామని స్పష్టం చేశారు పవన్.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: