ఇంత దారుణమా? శబరిమలకు వెళ్లిన రెహానాపై భక్తుల ఆగ్రహం!

Edari Rama Krishna

గతవారంలో శబరిమలలోని అయ్యప్ప దర్శనానికి వచ్చిన ముస్లిం యువతి రెహానాపై ఇప్పుడు హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.  ఇప్పటికే శబరిమల అయ్యప్పను దర్శించుకోవడానికి ప్రయత్నించిన రెహానా ఫాతిమాను ముస్లిం సమాజం బహిష్కరించిన విషయం తెలిసిందే.  రెహానాను, ఆమె కుటుంబ సభ్యులను బహిష్కరించాలని ఎర్నాకులం సెంట్రల్ ముస్లీం జమాత్‌ను కేరళ జమాత్ కౌన్సెల్ ఆదేశించింది. కాగా, రెహానా చేసిన పని వల్ల హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, అదే సమయంలో ఆమె చేసిన పని హిందూ ఆచారానికి విరుద్ధమని చెప్పారు. అలాగే, మత విశ్వాసాలను కాలరాస్తూ విగ్రహారాధన చేయాలన్న ఆమె ఉద్దేశ్యం కారణంగా బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.


గత శుక్రవారం పోలీసుల భద్రత మధ్య రెహానా ఫాతిమా,  హైదరాబాద్‌కు చెందిన జర్నలిస్ట్ కవిత జక్కల శబరిమల కొండ ఎక్కారు. పూజారులు ఆందోళన చేపట్టడంతో.. కేరళ ప్రభుత్వ జోక్యంతో ఆలయానికి 500 మీటర్ల దూరంలో వీరు ఆగిపోయారు.   రెహానాను ముస్లింగానే గుర్తించిన శబరిమల ప్రధాన పూజారి.. ఆమె వచ్చిన మార్గాన్ని శుద్ధి చేయాలని పిలుపునిచ్చారు. ఆమె ఆలయంలోకి అడుగుపెట్టకుండా నిరసన చేపట్టారు. ఇదిలా ఉంటే..రెహానా, వాడేసిన శానిటరీ నాప్ కిన్స్ ను తీసుకుని ఇరుముడిలో పెట్టుకుని పంబ దాటిందని వార్తలు గుప్పుమనడం, ఆపై కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ స్పందిస్తూ, ఇది చాలా తప్పని తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించడంతో ఈ వార్త దావానలమైంది. 


రెహానా శానిటరీ నాప్ కిన్స్ ను పరమ పవిత్రంగా భావించే ఇరుముడిలో ఉంచిందన్న విషయాన్ని తట్టుకోలేకున్నామని భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు..స్నేహితుల ఇంటికే ఇటువంటి నాప్ కిన్స్ తీసుకెళ్లే ప్రయత్నం చేయబోము. అటువంటిది దేవుడి గుడికి తీసుకెళ్లడం ఏంటి?" అని స్మృతీ ఇరానీ చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.


అయితే రెహానా కేవలం హిందువుల మనోభావాలు దెబ్బతీయడమే కాదు..మహిళలను కూడా కించపరిచేలా చేసిందని..ఈ వివాదంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న కేరళ మహిళలు కొందరు, మత కల్లోలాలు రేపేందుకు కుట్ర పన్నిన కొందరు రెహానాతో కావాలని ఈ పని చేయించారని అంటున్నారు. మరికొందరు మాత్రం అసలు విషయం తెలుసుకొని ఆరోపణలు చేస్తే మంచిదని అంటున్నారు.  ఏది ఏమైనా ఇప్పుడు శబరిమలై లాంటి పుణ్యక్షేత్రం వివాదాలతో సతమతమవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: