రాష్ట్రపాలన సినిమా స్క్రిప్ట్, స్క్రీన్-ప్లే ఆధారంగా నడుస్తోంది-ఇక మనకి సినిమానే!

సినిమా వాళ్ళ సెట్టింగులు లక్ష్యంగా ఆధారంగా అమరావతి మహానగర నిర్మాణం జరగనుంది. ఒక సినిమా దర్శకుడు మన అభివృద్ధి కార్యక్రమాలను, రాష్ట్ర పాలన ప్రణాళికలను షూట్ చేసి చూపుతారు. మరో సినిమా దర్శకుడు పుష్కరాలలో ముఖ్యమంత్రి ఆయన కుటుంబ సభ్యుల విన్యాసాలను చిత్రీకరించి మనకు వీలుంటే వెండి తెరపై చూపుతారు. ఆ సందర్భంగా ముప్పైమంది సాధారణ ప్రజలు మరణించినా మా ప్రభుత్వానికి వెంట్రుకతో సమానం.

ఈ సినిమా దర్శకులంతా ముఖ్యమంత్రి సామాజిక వర్గంవాళ్ళే. అందులో ఒక మహనీయ దర్శకుడైతే సినిమా హీరోయిన్ల నాభిపై పుష్పాల పూజ, ఫలాల నైవేధ్యం పెడతారు అందుకే ఆయనకి పుష ఫలాలు సమర్పించటానికి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యత్వం ఇచ్చారు.



ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసమర్థపాలన కొనసాగతుందని బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు లక్ష్మీనారాయణ ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని విమర్శించారు. ప్రజా ప్రతినిధులకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహనరెడ్డిపై దాడిని ప్రతీ మానవుడూ ఖండించాల్సిందే నని అన్నారు. మానవ జన్మ ఎత్తిన ఎవరైనా ఖండిస్తారన్నారు.

Why So Hurry In Showing Him As Jagan Fan? self goal of TDP and its Leadership

ప్రతిపక్షనేత రాష్ట్రంలో తిరిగే పరిస్థితి లేదని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. గతంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పై దాడి జరిగిందని, అలాగే తనపై కూడా దాడి జరిగిందని ఇప్పుడు వైఎస్ జగన్మోహన రెడ్దిపై దాడి జరిగిందని మండిపడ్డారు. భవిష్యత్ లో పవన్ కళ్యాణ్ పై కూడా దాడి చేయటానికి కుట్రలు పన్ను తున్నారని కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.


మరోవైపు అలిపిరిలో దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు నాడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎందుకు ఫిర్యాదు చేయలేదని కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో అసమర్థ పాలన జరుగు తుంటే గవర్నర్ జోక్యం చేసుకోవడంలో తప్పేం లేదని తెలిపారు. ఆత్మహత్య చేసుకునే వ్యక్తి సూసైడ్ నోట్ రాసుకోవడం చూశాం గానీ హత్య చేసే వ్యక్తి ఒక లేఖ రాయడం టీడీపీ ప్రభుత్వహాయాంలోనే చూస్తున్నామని కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.


"ఆపరేషన్ ద్రవిడ, రాక్షస, గరుడ" లాంటి పేర్లతో అక్రమాల సృష్టి కర్త నారా చంద్రబాబు నాయుడే నని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఒక్క సినిమా కూడా చేతిలో లేక బేకారుగా ఉన్న ఒక సినీ నటుని పైత్యానికి స్పందించే స్థాయికి ఒక చారిత్రాత్మక రాష్ట్ర ముఖ్యమంత్రి దిగజారి పోయారని ఘాటుగా విమర్శించారు. ముందుకు ముండే బ్రహ్మంగారి కాల ఙ్జానాన్ని వైట్ బోర్డ్  బొమ్మలు గీసి పై మన స్వంత పచ్చ టివి చానళ్లలో  వివరించే సినీ నటుడు శివాజీని తక్షణమే అదుపులోకి తీసుకొని జాతీయ లేక పొరుగు రాష్ట్రాల నిఘా సంస్థలచే విచారణచేసి వాటి వెనకున్న కుట్రలు బట్టబయలు చేయాలని డిమాండ్ చేశారు. అరాచక వాదులెప్పుడూ క్షమర్హులు కాదని చెప్పారు.


సినిమా నటుడు సినిమా వేషాలు వేస్తూ, ఒక పౌరునిగా బాధ్యతలు మరచి, ఒక కులం కోసం దాని ఆదిపత్యం కోసం మాట్లాడటం ఇతరులకు ఏమాత్రం నచ్చదు. పచ్చ టివి చానళ్లలో సినిమా నటుడు చదివిన స్క్రిప్ట్ అంతా ముఖ్యమంత్రి రాసిందేనని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. బాబుకు ఓటమి భయంతో  అధికారం లేకపోతే బ్రతకలేననే దిగులుతో  "బుద్ధిమాంద్యం అంటే డిప్రెషన్" పట్టుకుందని విమర్శించారు. అందుకే ఏడాది సర్వీస్ ఉన్న ప్రసాదరావుని తప్పించి  చంద్రబాబు నాయుడు తన బంధువు ను డీజీపీగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబులా, మోదీ సీబీఐలో తన బంధువును పెట్టుకోలేదని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: