జగన్ పై హత్యాయత్నం- సానుభూతిని షిఫ్ట్ చేయటానికి బాబు హస్తినలో గ్రేట్ డ్రామా!

నలభై సంవత్సరాల సుధీర్ఘ అనుభవం సంపాదించి పెట్టిన అహకారం, నిప్పునంటూ లేని సచ్చీలత అనే కలరు వేసుకోవటం, ప్రజలలోని రాజకీయ అభిమానాన్ని తన కులాభివృద్ధికి వాడేసి నమ్మిన ప్రజల్ని నట్టేట ముంచే చంద్రబాబు "రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుని పై జరిగిన హత్యాయత్నం పై అమానవీయంగా స్పందించటమేకాదు - నిర్దయగా మాట్లాడిన రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలివిలేమిని గుర్తించక - అహంకారంతో ఆయన్ని దుర్భాషలాడిన ఫలితంగా ఉవ్వెత్తున జనహృదయాల్లో రగిలిన అసహ్యాన్ని జనం మౌనం వహించి ఊర్కున్నారంటే జగంపై - అది జగన్ పై జనాభిమానం.


జనంలో ఉన్న నిశ్శబ్ధానికి షాకైన చంద్రబాబు శకుని వ్యూహం పన్ని హస్తినాపురమైనా అక్కున చేర్చుకుంటుందేమో నని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరి పోయారు అక్కడ బీజీబిజీగా గడిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్రం కుట్రపన్నిందని రాష్ట్రంలో అస్థిరత సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని చంద్రబాబు ఆరోపణల పర్వానికి తెరలేపారు. ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న కుట్ర అంటూ ఢిల్లీ కేంద్రంగా చేసుకొని తేల్చుకుంటానంటూ లేని సంబంధం అంటగట్తి అయినదానికి కానిదానికి  అమితుమీకి సిద్ధమయ్యారు.


ఆ ఆలోచనను మనసులో పెట్తుకొని దానికి కార్యరూపమిస్తూ నేఱం కేంద్రం మీదకు నెట్తేసి జాతీయ స్థాయిలో అధికార ప్రతిపక్షాల మద్యకు తన శత్రుత్వాన్ని బదిలీ చేసి ఏపీలో కేంద్రం చేస్తున్న కుట్రలంటూ తిప్పికొట్టేందుకు చంద్రబాబు తన పాపానికి జాతీయ స్థాయి మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.


ఈ శకుని వ్యూహం నేపథ్యంలో దాచి హస్తిన చేరుకున్న చంద్రబాబు అకస్మాత్తుగా ఏద్ఫో ముఖ్యమైనా పనులను సృష్టించుకొని నగరంలో అందుబాటులో ఉన్న ప్రతిపక్ష శాసన సభ్యులతో ఏపీ భవన్ లో సమావేశమై హడావిడి చేశారు. ఎంపీలతో సమావేశం అనంతరం చంద్రబాబు నాయుడు ఏపీభవన్ లోనే 'లోక్ తంత్రిక్ జనతాదళ్' వ్యవస్థాపక అధ్యక్షుడు శరద్ యాదవ్, డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సీపీఐ నేత సురవరం సుధాకరరెడ్డిలతో 'లంచ్ మీటింగ్' లో పాల్గొన్నారు. ఏపీలో ఐటీ దాడులు, జగన్‌ పై దాడి ఘటన, కేంద్రం సహాయ నిరాకరణ, ఆపై కేంద్రం పై ఉన్నవి లేనివి అంటే ఒక సినిమా నటుడు చెప్పిన సినిమా కథ "ఆపరేషణ్ ద్రవిడ, గరుడ, రాక్షస" గురించి చర్చించారు, ఆపై తెలుగువాళ్లకే ప్రత్యేకమైన ఆవుకతలు మహా రంజుగా వినిపించారు.


వీటితోపాటు రాష్ట్ర రాజకీయాల్లో గవర్నర్ జోక్యంపై కూడా చంద్రబాబు వారికి వివరించారు. నాగుగేళ్ళ స్నేహంలో ఈయనను బాగా అర్ధం చేసుకున్న నరేంద్ర మోడీ తన చర్మం నలిపి చెమత మడ్డి కూడా అందివ్వక పోవటంతో, ఇప్పుడు ఇక దేశం గుర్తుకు రాగా దేశంలో సంచలనం సృష్టిస్తున్న రాఫెల్ కుంభకోణం, సీబీఐలో లంచం, సీబీఐ డైరెక్టర్ తొలగింపు, ఇతర రాష్ట్ర అంతర్గత విషయాల్లో కేంద్రం కలగజేసుకోవటం వంటి అంశాలను వెలికి తీసి వాటిపై జాతీయ స్థాయిలో చర్చిస్తున్నారు చంద్రబాబు.


తనకు స్వలాభం పండించగలవన్న అంశాలకు జాతీయ సమస్యలుగా కేంద్రం కుట్రలగా జాతీయ స్థాయిలో ప్రచారం చేసి ఎండగట్టాలని ప్రయత్నిస్తూ వారికి ప్రయోజన కరాలని మార్చి చెప్పి దేశ ప్రయోజనాలకోసం ప్రయత్నిస్తున్నానని అందుకు సహకరించాలని కోరారు.


డెమోక్రసీ ఇన్‌ డేంజర్‌,టార్గెట్‌ ఏపీ పేరు తో ముందే తనకు కంటోపాఠమైన ఆవు కథను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా కేంద్ర కుట్రలుగా తెలియజేశారు. దేశాన్ని ఎలా రక్షించు కోవాలనే అంశంపైనే తాను చంద్రబాబుతో చర్చించానని  నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత 'ఫరూక్ అబ్ధుల్లా' అంటే "అలాగే" అని స్పష్టం చేశారు. నిన్న శనివారం సాయంత్రం ఆయన ఏపీ సీఎం చంద్రబాబుతో ఢిల్లీలో భేటీ అయ్యారు. దేశం ముఖ్యం, దేశ భిన్నత్వాన్ని కాపాడుకోవడం ముఖ్యమన్నారు. అన్ని పక్షాలను కలుపుకొని ముందుకెళ్తామని, ఐకమత్యం సాధిస్తామని వెల్లడించారు. ఈ మహానుభావుడు కాశ్మీర్లో పాకిస్థాన్ కు మద్దతిస్తూ భారత్ ద్రోహులను రహస్యంగా ప్రోత్సహిస్తాడు.


ఎన్నికల ముందు ప్రధాని అభ్యర్థి ఎవరనేది అవసరం లేదని, గెలిచిన తర్వాత ప్రధాని అభ్యర్థిపై నిర్ణయించు కోవచ్చని తెలిపారు. రాహుల్‌ గాంధి తానేమీ కూటమి నాయకుడిగా లేదా ప్రధాని అభ్యర్థిగా చెప్పలేదు కదా? అని ప్రశ్నించారు.


అటు బీఎస్పీ అధినేత్రి మాయావతి తో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఏపీకి సాయం చేయడంలో కేంద్రం మొండి చేయి చూపడం, విభజన చట్టంలో పడాకున పడ్డ అంశాలతో పాటు దేశంలోని రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలోని వ్యాపారుల అక్రమాలను ఐటీ దాడులను తెదేపా లక్ష్యంగా జరుగుతున్న దాడులుగా ఆమెకు వివరించారు.


శత్రువు శత్రువు మిత్రుడన్న రాజకీయ సూక్ష్మం బాగా గ్రహించిన ఆ మాయమహి ఈ సందర్భంగా చంద్రబాబును ప్రత్యేకంగా ఆశీర్వదించారు. సమావేశం అనంతరం కారు దాకా కూడా కూడా వచ్చి చంద్రబాబును సాగనంపారు. "భవిష్యత్‌ లో కలిసి పనిచేద్ధాం" అని ఎందుకైనా పనికిరావచ్చనే ఉద్దేశంతో ఒక ఫీలర్ చంద్రబాబుకు  వదిలారు  మాయావతి. నాలుగేళ్ళు తన శత్రువుతో స్నేహం చేసి బయటకు వచ్చిన కొత్త మిత్రుణ్ణి "టిష్యూ పేపర్" లాగ ఎలా వాడుకోవచ్చో తెలిసిన 'కాన్షి శిష్యురాలు" కదా! 


ప్రాంతీయ పార్టీలు బలపడాల్సిన అవసరం ఉందని, ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో అధికారం లోకి వస్తే నియంతృత్వ పోకడలు ఉండవని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ - బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందని, ఎన్నికలు జరగుతున్న 4రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ తో ఏర్పడిన విభేదాలపై కాంగ్రెస్ కొత్త మిత్రుడైన చంద్రబాబుతో మాయావతి చర్చించారు.

ఈ వూండెడ్ సోల్జెర్స్ ఈ దేశాన్ని బాగు చేయగలరా! చూస్తుంటే వీళ్లకంటే నరెంద్ర మోడీనే చాలా బెటర్ అంటున్నారు జనం. కనీసం ఆయనకు కుటుంబం కూడా లేదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: