జగన్ కి ప్రాథమిక చికిత్స చేసిన డాక్టర్ బయటపెట్టిన సంచలన విషయాలు..!

KSK
ఇటీవల విశాఖపట్నం విమానాశ్రయం ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ పై శ్రీనివాస్ అనే వ్యక్తి కోడిపందాలు కత్తితో దాడి చేసిన విషయం మనకందరికీ తెలిసినదే. తాజాగా జగన్ పై జరిగిన హత్యా యత్నం రెండు తెలుగు రాష్ట్రాల ను ఎంతగానో వణికించింది. ఈ నేపథ్యంలో విశాఖ విమానాశ్రయంలో జగన్ కి ప్రాథమిక చికిత్స చేయించిన అపోలో మెడికల్‌ సెంటర్‌ డాక్టర్‌ కె.లలితాస్వాతి పై తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే ఒక వర్గం మీడియా ప్రచారం చేస్తున్న క్రమంలో..సదరు వైద్యురాలు ఆవేదన వ్యక్తం చేసింది.


‘జగన్‌పై అటాక్‌ చేశారు.. వెంటనే రావాలని ఎవరో యువకులు పరుగుపరుగున రావటంతో స్టెతస్కోపు, బీపీ మెషీన్‌ పట్టుకుని వెంటనే అక్కడికి వెళ్లా. జగన్‌ ధరించిన తెల్ల చొక్కా మొత్తం రక్తసిక్తం కావడంతో భయపడ్డా.. ఆయన ఓపిగ్గా జాగ్రత్త తల్లీ.. అని చెప్పారు.


నేను సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది నుంచి ఫస్ట్‌ ఎయిడ్‌ లోషన్‌ తీసుకుని ఫస్ట్‌ ఎయిడ్‌ మాత్రమే చేశా. ఎటువంటి ట్రీట్‌మెంట్‌ చేయలేదు. సుమారుగా 0.5 సెంటీమీటర్‌ మేర కత్తి దిగిందని రిపోర్టులో ఇచ్చా.గాయం లోతు అంతకన్నా ఎక్కువ ఉండవచ్చనే భావించా.రిపోర్టు కూడా పోలీసులు వచ్చి వెంటనే కావాలని ఒత్తిడి చేస్తే హడావుడిలో రాసిచ్చేశా.


కానీ ఆ రిపోర్ట్‌ను పట్టుకుని కొన్ని చానెళ్లు, నాయకులు తప్పుడు ప్రచారానికి దిగారు’ అని డాక్టర్‌ స్వాతి ఆవేదన వ్యక్తం చేశారు. నేనేదో పక్కాగా 0.5 సెంటీమీటర్‌ మాత్రమే గాయమైందని ధృవీకరించినట్టుగా వక్రీకరించారు..’అని స్వాతి వాపోయారు.మరోపక్క జగన్ పై జరిగిన దాడిని గురించి చాలా మంది రాజకీయ నేతలు ఇది అధికార పార్టీ తెలుగుదేశం చేసిందని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: