45 నిమిషాలు నరకం చూశాను.. ప్రాణాలతో బయటపడిన దూరదర్శన్ జర్నలిస్ట్!

Edari Rama Krishna
చత్తీస్‌గఢ్ ప్రాంతంలో  త్వరలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం  దంతెవాడలోని ఎన్నికల ఏర్పాట్లను కవర్‌ చేయడానికి వెళ్లిన దూరదర్శన్‌ జర్నలిస్టులపై మావోయిస్టులు దాడి చేశారు.  తన తలపై నుంచి 50 బులెట్లు దూసుకెళ్లాయని, ఆ 45 క్షణాలు భయానకంగా గడిచాయని మావోయిస్టుల దాడిలో ప్రాణాలతో బయటపడ్డ దూరదర్శన్‌ జర్నలిస్టు ధీరజ్‌ కుమార్‌ అన్నారు.   ఈ ఘటనలో కెమెరామెన్‌ అచ్యుతానంద్‌ సాహూతో పాటు మీడియా బృందానికి భద్రతాగా వెళ్లిన ఇద్దరు పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు. కాగా, ‘అమ్మా, ఐ లవ్ యూ... నేను ఇవాళ చనిపోతానేమో. కానీ చావు ముందు నిలబడినా నాకెందుకో కొంచెం కూడా భయం లేదు.

నక్సల్స్ మమ్మల్ని అన్నివైపుల నుంచి చుట్టుముట్టారు’ దంతేవాడలో నక్సల్స్ దాడికి పాల్పడిన సందర్భంగా గాయపడ్డ దూర్ దర్శన్ ఛానల్ కెమెరామెన్ మొర్ముకుట్ శర్మ చెప్పిన మాటలివి. ఒంట్లోకి బుల్లెట్లు దిగిపోవడంతో అచేతనంగా పడిపోయిన శర్మ.. కెమెరాను ఆన్ చేసి వీడియోను రికార్డు చేశాడు.  నిల్వాయా ప్రాంతంలో ప్రజలు 1998 నుంచి ఓటు వేయడం లేదని, ఈసారి వారు ఓటేసేందుకు వీలుగా కొత్తగా ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాన్ని కవర్‌ చేసేందుకు తాను, అచ్యుతానంద్‌ అక్కడకు వెళ్లామని, వెళ్లేముందు దంతెవాడ ఎస్పీని కలిశామని, ఆయన తమకు అనుమతి ఇచ్చారని, భద్రత కల్పిస్తామని చెప్పారని అన్నారు.   

ఈ సందర్భంగా మేం భద్రతా సిబ్బంది మోటార్ సైకిళ్లపై బయల్దేరామని, కాసేటికే తమ ముందు వెళ్తున్న బైక్‌ కిందపడిపోయిందని చెప్పారు. ఆ వెనుకే ఉన్న తమ కెమెరామెన్‌ సాహూకు బులెట్‌ తగిలిందని, తన కళ్లముందే అతను కుప్పకూలిపోయాడన్నారు.  ఆ సమయానికి తాను ఓ గుంతలో పడిపోయానని.. మాతో పాటు ఆర్మీసిబ్బంది కూడా ఉన్నారు. ఇంతలోనే ఒక్కసారిగా నక్సలైట్లు మమ్మల్ని చుట్టుముట్టేశారు. నేను బతుకుతానన్న ఆశ నాకు లేదు. చావు ముందున్నా నాకు భయం వేయడం లేదు.

ఇప్పటికే నాలుగు వైపుల నుంచి నక్సల్స్ చుట్టుముట్టారు. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను’ అని ముగించాడు. ఈ వీడియో రికార్డు చేసిన అనంతరం కొద్దిసేపటికి అక్కడకు అదనపు బలగాలు చేరుకుని వీరిని కాపాడాయి. 45 నిమిషాలు చాలా భయానకంగా గడిచిందని చెప్పారు. బులెట్‌ శబ్దాలు తనకు వినిపిస్తూనే ఉన్నాయని, దాదాపు 50 బులెట్లు తన తలపై నుంచే వెళ్లాయని, గుంతలో ఉండటంతో మావోయిస్టులు తనను చూడలేదన్నారు.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 



As the Police and Doordarshan team came under attack from Naxals, DD assistant cameraman recorded a message for his mother. pic.twitter.com/DwpjsT3klt

— Rahul Pandita (@rahulpandita) October 31, 2018

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: