గుర్తుపట్టలేనంతగా గోవా సీఎం!

siri Madhukar
గత కొన్నాళ్లుగా గోవా సీఎం మనోహర్ పారికర్ ఆరోగ్యం బాగోలేదనే సంగతి తెలిసిందే. మొదట గోవాలోనే చికిత్స పొందిన ఆయన.. తర్వాత ముంబైలో ట్రీట్‌మెంట్ తీసుకున్నారు.  ఢిల్లీ వెళ్లి ఎయిమ్స్‌లో చేరారు. వైద్య చికిత్స కోసం ఆయన అమెరికా కూడా వెళ్లారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అనేక ఊహాగానాలు వెలువడిన సంగతి తెలిసిందే.   ప్రస్తుతం ఆయన  ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాారు.   సీఎం గైర్హాజరీ ప్రభావం పరిపాలనపై లేదన్నారు అధికార పార్టీ సభ్యులు. మరోవైపు పారికర్ ఆరోగ్య పరిస్థితి ఏంటో చెప్పాలని గత కొద్ది వారాలుగా కాంగ్రెస్ పార్టీ గోవా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది.   

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ పై ఇప్పుడు కొత్త వివాదం మొదలైంది. తీవ్ర అనారోగ్యానికి గురై, అమెరికాలో చికిత్స పొంది, తిరిగి ఇండియాకు వచ్చిన పారికర్, ఏ మాత్రం గుర్తు పట్టలేనంతగా కనిపిస్తుండటమే ఇందుకు కారణం.  తాజాగా పారికర్, గోవా సీఎంగా పాలనా పరమైన వ్యవహారాలను నిర్వహిస్తున్నారని బీజేపీ, ఓ ఫొటోను విడుదల చేయగా, నిజాలను దాచి పెడుతూ, ఆయన ఆరోగ్యంతో బీజేపీ ఆటలాడుతోందని కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది.   అంతే కాదు ఆయను ప్రజలకు చూపించాలని..బీజేపీ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపిస్తుంది. 

కాగా, ఈ ఫొటోల్లో శారీరకంగా చాలా సన్నబడ్డట్టు కనిపిస్తున్న పారికర్, ఎడమ చెయ్యి స్వాధీనంలో లేనట్టు, దానికి బ్యాండ్ వేసినట్టు కనిపిస్తోంది. చేతి వేళ్లు కూడా ఆకారాన్ని కోల్పోయి వాలిపోయినట్టు తెలుస్తోంది. ఇక ప్యాంటు లోపలి కాళ్లు చాలా బలహీనంగా అయిపోయినట్టు తెలుస్తోంది. ముఖం కూడా పూర్తిగా మారిపోయింది.  అయితే గోపా ముఖ్యమంత్రి పారికర్ ఫోటో చూసిన నెటిజన్లు ప్రస్తుతం ఆయన అనారోగ్య పరిస్థితి వల్ల అలా ఉన్నారని..ఆయన ఆరోగ్యం పట్ల  శ్రద్ధ చూపుతున్నారని కొందరు అభినందిస్తుండగా, చాలా మంది ఆయన్ను బీజేపీ పావుగా వాడుకుంటోందని, ప్రజల్లోకి ఆయన్ను తేవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: